హయత్‌నగర్‌ అభివృద్ధికి నవజీవన్ రెడ్డి అలుపెరుగని కృషి.

  • మురుగునీటి సమస్య పరిష్కారానికి ప్రతిపాదనలు, ​
  • రూ. 63.50 లక్షలతో పలు కాలనీల్లో సీసీ రోడ్ల పనులు.
  • ​క్షేత్రస్థాయిలో పర్యటించిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి.

హయత్‌నగర్‌ అభివృద్ధికి నవజీవన్ రెడ్డి అలుపెరుగని కృషి.

హయత్‌నగర్:

హయత్‌నగర్ డివిజన్‌న ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు స్థానిక కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన డివిజన్‌లోని పలు కాలనీల్లో పర్యటించి, అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు సమస్యలను స్వయంగా పరిశీలించారు.

​మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం.

​సూర్యనగర్ కాలనీలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న భూగర్భ డ్రైనేజీ పైప్‌లైన్ ఎక్స్టెన్షన్ సమస్యను జలమండలి అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. కాలనీవాసుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

 నిధుల మంజూరుకు ఉన్నతాధికారులతో చర్చించి మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.

​ముమ్మరంగా సీసీ రోడ్ల పనులు:

​డివిజన్ వ్యాప్తంగా రూ. 63.50 లక్షల వ్యయంతో చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులను ఆయన పర్యవేక్షించారు.
​సాయిబాబా కాలనీ: రూ. 42.50 లక్షలతో చేపట్టిన నూతన సీసీ రోడ్ల పనులను కాలనీవాసులతో కలిసి పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటించాలని, గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.

​రంగనాయకుల గుట్ట: 

రూ. 21 లక్షల నిధులతో మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించి అధికారులతో కలిసి లెవెల్స్‌ను పరిశీలించారు. మరో రెండు రోజుల్లో ఈ పనులు ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు.

​పదవీకాలం ముగిసే వరకు ప్రజల సేవలోనే..

​గత ఐదేళ్లుగా డివిజన్ అభివృద్ధియే ధ్యేయంగా పని చేస్తున్నామని, పదవీకాలం చివరి దశకు వచ్చినప్పటికీ ప్రతి పనిని పర్యవేక్షిస్తూ ప్రజల మధ్యే ఉంటానని నవజీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి భాస్కర్, డివిజన్ అధ్యక్షుడు గంగాన శ్రీనివాస్, జలమండలి మేనేజర్ రాజు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు బత్తు రవి, మహేందర్, భాస్కర్, కుమార్‌తో పాటు పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు.

About The Author