ప్రశంసా పత్రాలు అందుకున్న నిర్మల్ జిల్లా ఎస్పీ పీఆర్వో నరిమెట్ల వంశీ..

తెలంగాణ రాష్ట్ర డీజీపీ డా. శివధర్ రెడ్డి గారి చేతుల మీదుగా కార్యక్రమం.. 
సోషల్ మీడియా ఇన్‌చార్జి రామ్ పవన్ కుమార్.. 
జిల్లా ఎస్పీ డా. జి.జానకి షర్మిల గారి ప్రోత్సాహం మాకు ప్రేరణ :   
పీఆర్వో నరిమెట్ల వంశీ, సోషల్ మీడియా ఇంచార్జి రామ్ పవన్ కుమార్

WhatsApp Image 2025-11-13 at 5.23.32 PM

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో : 

Read More సైన్స్ జీవితానికి ఉపయోగపడాలీ

హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర పోలీస్ పీఆర్వోల ప్రొఫెషనల్ ట్రైనింగ్ శిబిరం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా పీఆర్వో నరిమెట్ల వంశీ, సోషల్ మీడియా ఇన్‌చార్జి రామ్ పవన్ కుమార్ లు డీజీపీ డా. శివధర్ రెడ్డి చేతుల మీదుగా సర్టిఫికేట్లు అందుకున్నారు.

Read More మాజీ ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిసిన ఏకగ్రీవమైన సర్పంచ్ కేతిరి

ఈ సందర్భంగా డీజీపీ  పీఆర్వోలను ఉద్దేశించి మాట్లాడుతూ...“ప్రజలతో పోలీసులను కలిపే వంతెనలుగా పీఆర్వోలు వ్యవహరించాలి. ప్రతి సంఘటనలో పోలీస్ శాఖ యొక్క నిజమైన ప్రతిఛాయను సమాజానికి చేరవేయడం మీ ప్రధాన బాధ్యత. మీ మాట, మీ రాత ప్రజల్లో విశ్వాసం కలిగించేలా ఉండాలి. సమాచారాన్ని సరిగ్గా, సమయానికి అందించడం ద్వారానే పోలీస్ శాఖ ప్రతిష్ట పెరుగుతుంది. సోషల్ మీడియా యుగంలో ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ అత్యంత కీలకం” అని సూచించారు.

Read More ఓటరు మహాశయా ఒక్కసారి ఆలోచించు..

అలాగే, పీఆర్వోలు శిక్షణలో పొందిన జ్ఞానం, నైపుణ్యాలను ప్రాథమిక స్థాయిలో వినియోగించి, పోలీస్–ప్రజల మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా నరిమెట్ల వంశీ, రామ్ పవన్ కుమార్ మాట్లాడుతూ..ఈ మూడు రోజుల శిక్షణలో మేము ఎంతో నేర్చుకున్నాము. డీజీపీ గారి సూచనలను పాటిస్తూ, ప్రజల్లో పోలీస్ శాఖపై మరింత నమ్మకాన్ని పెంపొందించే విధంగా రచనలు కొనసాగిస్తాము. మా మీద నమ్మకం ఉంచి ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిన మా జిల్లా *ఎస్పీ.డా. జి.జానకి షర్మిల. గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. నిర్మల్ పోలీస్ వార్తలను మరింత ప్రొఫెషనల్‌గా, ప్రజలకు చేరువగా రాస్తాము” అని తెలిపారు.  

Read More తుది మెరుగులు దిద్దుకుంటున్న బ‌మృక్‌నుద్దౌలా చెరువు

About The Author