సదర్ ఉత్సవంలో నిర్మల జగ్గారెడ్డి దంపతులు
- సంగారెడ్డిలో ఘనంగా పెద్దగొల్ల సదర్ ఉత్సవం
- ఆకట్టుకున్న దున్న రాజుల విన్యాసాలు
- పాటలతో జోష్ తెప్పించిన గాయకులు

సంగారెడ్డి :
సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్ లో పెద్ద గొల్ల సదర్ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. దున్న రాజుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. యువత అధిక సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. వారిలో జోష్ నింపేలా సింగర్స్ పాటలు పాడారు. ఈ సదర్ ఉత్సవంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కూన సంతోష్ తదితరులు పాల్గొన్మారు.ఈ సదర్ ఉత్సవానికి హాజరైన జగ్గారెడ్డి అందరిలో జోష్ నింపారు. కార్యక్రమానికి వచ్చినవారు ఆయనతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి ప్రదర్శించారు. అనంతరం అక్కడున్న వారితో కలిసి జగ్గారెడ్డి స్టెప్పులు వేశారు. సదర్ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించిన ప్రతినిధులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.
