మన అగ్రిటెక్ లో నూతన డ్రోన్ స్ప్రేయర్ ఆవిష్కరణ చేసిన ఎనుమాముల మార్కెట్ గ్రేడ్ సెక్రటరీ నిర్మల
భారతశక్తి ప్రతినిధి, వరంగల్, ఫిబ్రవరి 04: సాంకేతిక పరిజ్ఞానాన్నీ అందిపుచ్చుకుని నేటి ఈ మానవలోకం ఎంతో ముందడుగు వేస్తుందని అనుకున్నదే తడవుగా నిమిషాల్లో అనుకున్న పనిని పూర్తి చేసే విధంగా ఆధునీకరణ చెందిందంటే అతిశయోక్తి కాదు.నేడు వ్యవసాయ రంగంలో సైతం సాంకేతిక పరిజ్ఞానంతో ఒక్కో అడుగు ముందుకు వేస్తున్న తరుణంలో వ్యవసాయ రంగాన్ని మరింత సులభతరం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంచే ఆమోదించబడిన ప్రముఖ సంస్థ దక్ష కంపెనీ వారు మన అగ్రిటెక్ అధినేత పాషికంటి రమేష్ నేతృత్వంలో మంగళవారం వరంగల్ ఎనుమాముల లోని మన అగ్రిటెక్ కార్యాలయంలో డ్రోన్ స్ప్రేయర్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ గ్రేడ్ సెక్రటరీ నిర్మల,మార్కెట్ మాజీ డైరెక్టర్ పీన్నింటి వెంకట్ రావు,నూతనకల్ పిఏసిఎస్ చెర్మెన్ జయసుధ ఇతర ప్రముఖులు ముఖ్య అతిధులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి నూతన డ్రోన్ పరికరాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దక్ష కంపెనీ ప్రతినిధులు రైతులకు డ్రోన్ ప్రదర్శన నిర్వహించి పూర్తి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మన అగ్రిటెక్ అధినేత పాషికంటి రమేష్ మాట్లాడుతూ వ్యవసాయంలో రైతులు ఆధునీకరణ దిశగా సాగుతూ ఎన్నో అద్భుతాలను సృష్టించడంలో మన అగ్రిటెక్ సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని అందులో భాగంగా మంగళవారం మన అగ్రిటెక్ లో నూతన డ్రోన్ ప్రారంభించడం జరిగిందన్నారు. ఆధునిక ఫిచర్స్ తో రైతుల సమయం,ఖర్చు ఆదా చేసుకోవడమే కాకుండా ఇతర రైతులకు స్ప్రే చేయడం ద్వారా అధిక మొత్తంలో సంపాదించవచ్చన్నారు.డ్రోన్ స్ప్రేయర్స్ కావలసిన వారు మన అగ్రిటెక్ ను సంప్రదించగలరని తెలిపారు.డ్రోన్ స్ప్రేయర్ ప్రత్యేకతలను వివరించారు. కేంద్ర ప్రభుత్వంచే ఆమోదించబడిన ప్రముఖ దక్ష కంపెనీ వారి డ్రోన్ స్ప్రేయర్ నేడు మన అగ్రిటెక్ లో ఆవిష్కృతమైంది.ఈ డ్రోన్ 10 లీటర్ల నీటి సామర్ధ్యంతో రెండు బ్యాటరీలు అందిస్తున్నారు. బ్యాటరీలను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3ఎకరాలకు వస్తుంది.ఒక ఎకరా కేవలం 5 నుండి 7 నిమిషాల వ్యవధిలో పిచికారి చేయడం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాల కోసం ఎనుమాముల లోని మన అగ్రిటెక్ స్టోర్ ను సందర్శించమని రైతులను కోరారు.
భారతశక్తి ప్రతినిధి, వరంగల్, ఫిబ్రవరి 04:
సాంకేతిక పరిజ్ఞానాన్నీ అందిపుచ్చుకుని నేటి ఈ మానవలోకం ఎంతో ముందడుగు వేస్తుందని అనుకున్నదే తడవుగా నిమిషాల్లో అనుకున్న పనిని పూర్తి చేసే విధంగా ఆధునీకరణ చెందిందంటే అతిశయోక్తి కాదు.నేడు వ్యవసాయ రంగంలో సైతం సాంకేతిక పరిజ్ఞానంతో ఒక్కో అడుగు ముందుకు వేస్తున్న తరుణంలో వ్యవసాయ రంగాన్ని మరింత సులభతరం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంచే ఆమోదించబడిన ప్రముఖ సంస్థ దక్ష కంపెనీ వారు మన అగ్రిటెక్ అధినేత పాషికంటి రమేష్ నేతృత్వంలో మంగళవారం వరంగల్ ఎనుమాముల లోని మన అగ్రిటెక్ కార్యాలయంలో డ్రోన్ స్ప్రేయర్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మార్కెట్ గ్రేడ్ సెక్రటరీ నిర్మల,మార్కెట్ మాజీ డైరెక్టర్ పీన్నింటి వెంకట్ రావు,నూతనకల్ పిఏసిఎస్ చెర్మెన్ జయసుధ ఇతర ప్రముఖులు ముఖ్య అతిధులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి నూతన డ్రోన్ పరికరాలను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో దక్ష కంపెనీ ప్రతినిధులు రైతులకు డ్రోన్ ప్రదర్శన నిర్వహించి పూర్తి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మన అగ్రిటెక్ అధినేత పాషికంటి రమేష్ మాట్లాడుతూ వ్యవసాయంలో రైతులు ఆధునీకరణ దిశగా సాగుతూ ఎన్నో అద్భుతాలను సృష్టించడంలో మన అగ్రిటెక్ సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని అందులో భాగంగా మంగళవారం మన అగ్రిటెక్ లో నూతన డ్రోన్ ప్రారంభించడం జరిగిందన్నారు.
ఆధునిక ఫిచర్స్ తో రైతుల సమయం,ఖర్చు ఆదా చేసుకోవడమే కాకుండా ఇతర రైతులకు స్ప్రే చేయడం ద్వారా అధిక మొత్తంలో సంపాదించవచ్చన్నారు.డ్రోన్ స్ప్రేయర్స్ కావలసిన వారు మన అగ్రిటెక్ ను సంప్రదించగలరని తెలిపారు.డ్రోన్ స్ప్రేయర్ ప్రత్యేకతలను వివరించారు.
కేంద్ర ప్రభుత్వంచే ఆమోదించబడిన ప్రముఖ దక్ష కంపెనీ వారి డ్రోన్ స్ప్రేయర్ నేడు మన అగ్రిటెక్ లో ఆవిష్కృతమైంది.ఈ డ్రోన్ 10 లీటర్ల నీటి సామర్ధ్యంతో రెండు బ్యాటరీలు అందిస్తున్నారు.
బ్యాటరీలను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3ఎకరాలకు వస్తుంది.ఒక ఎకరా కేవలం 5 నుండి 7 నిమిషాల వ్యవధిలో పిచికారి చేయడం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాల కోసం ఎనుమాముల లోని మన అగ్రిటెక్ స్టోర్ ను సందర్శించమని రైతులను కోరారు.
