ఒక్క మొక్క - భవిష్యత్తుకు భరోసా : జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణ కుమార్
ఎల్బీనగర్:
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (డిఎల్ఎస్ఏ) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన వృక్షారోపణ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణ కుమార్, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి వినోద్ కుమార్, సత్యేందర్, శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి శ్రీమతి అనూష, రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోలి విప్లవ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వొద్యారపు రవికుమార్, వైస్ ప్రెసిడెంట్ రమేష్ కుమార్, సంయుక్త కార్యదర్శి మల్లేష్, కోశాధికారి మాధవి, లైబ్రరీ కార్యదర్శి ప్రసాద్, మహిళా ప్రతినిధి అర్చన, సాంస్కృతిక కార్యదర్శి సుధా, కార్యవర్గ సభ్యులు నగేష్ నాయక్, నరేష్, స్రవంతి, శ్రీవాణి, శ్రీలత బార్ కౌన్సిల్ సభ్యుడు గోకుల్ రామారావుతో పాటు పలువురు న్యాయమూర్తులు,న్యాయవాదులు పాల్గొని మొక్కలు నాటి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొని పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు..
