సరిహద్దుల చెక్ పోస్టులను మూసివేయాలని ఆదేశాలు జారీ.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో :
ఈ నిర్ణయించడాన్ని ప్రత్యేకంగా లారీ యజమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు ..
ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి , రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు .
తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ సాదిక్
తెలంగాణలో ఆర్టిఏ చెక్ పోస్టులు మూసివేతపై హర్షం
బోర్డులు, బారికేడ్లు తొలగింపు పట్ల ప్రభుత్వానికి లారీ యజమానుల కృతజ్ఞతలు

లారీ యజమానుల సమస్యలను పరిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ కు ధన్యవాదాలు
అవినీతి అడ్డాలుగా మరి వాహనదారులను పీల్చి తింటున్న సరిహద్దుల్లోని ఆర్టీఏ చెక్ పోస్టులను ఎత్తిన వేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడాన్ని వాహనదారులు ప్రత్యేకంగా లారీ యజమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు .. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి , రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు .ఇటీవల సరిహద్దు చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు దాడిచేసిన నేపథ్యంలో వారి అవినీతిని చూసి అవాక్కు అయ్యారని ఇదే విషయాన్నీ ఉన్నతాధికారులకు తెలియజేశారు . వారు సీఎం దృష్టికి తీసుకోని పోవడంతో వెంటనే చెక్ పోస్టులు మూసి వేసి ఆన్ లైన్ ద్వారా కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించారు …ఈ మేరకు బుధవారం ఒకే సమయంలో సరిహద్దుల చెక్ పోస్టులను మూసివేయాలని ఆదేశాలు వెళ్లడం అక్కడ బోర్డులు తీసివేయాలని ,చెక్ పోస్టుల్లో ఉన్న ఫుర్నిచర్ ఆర్టీఓ కార్యాలయాలకు తరలించాలని ఆదేశాలు జారీచేశారు ..సిబ్బందిని రాష్ట్ర ట్రాస్పోర్ట్ కమిషనర్ కు రిపోర్ట్ చేయాలనీ ఆదేశాల్లో పేర్కొన్నారు .
చెక్ పోస్టుల దగ్గర వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని వెల్లడించారనీ రికార్డులు, ఫర్నీచర్, పరికరాలు వెంటనే జిల్లా ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయానికి తరలించాలని తెలిపారు. ఆర్థిక, పరిపాలనా రికార్డులను సమన్వయం చేసి భద్రపరచాలని ప్రభుత్వం ఆదేశించిందని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా తగిన ప్రకటనలు ఇవ్వాలని చెప్పారు. చెక్ పోస్టుల మూసివేతపై సమగ్ర నివేదిక అక్టోబర్ 22 సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని రవాణాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారని వెంటనే చర్యలు తీసుకుంటున్నందుకు ప్రభుత్వానికి లారీ ఓనర్స్ అసోసియేషన్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు అని సయ్యద్ సాదిక్ పేర్కొన్నారు..
