దోమల నియంత్రణకు స్వంత ఖర్చులతో ఫాగింగ్ యంత్రాలు.

బీఆర్ఎస్ యువనేత చంద్రశేఖర్ రెడ్డి సేవా కార్యక్రమం

దోమల నియంత్రణకు స్వంత ఖర్చులతో ఫాగింగ్ యంత్రాలు.

ఎల్బీనగర్:

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న యువనేత సొంటి చంద్రశేఖర్ రెడ్డి మరోసారి సేవా స్పూర్తిని చాటుకున్నారు. ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సూచనల మేరకు “దోమలపై యుద్ధం” కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సొంటి చంద్రశేఖర్ రెడ్డి స్వంత నిధులతో రెండు దోమలను పారదోలే ఫాగింగ్ యంత్రాలను కొనుగోలు చేశారు. ఈ యంత్రాలను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, దోమల నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజా ఆరోగ్య సమస్యలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని కోరారు. అనంతరం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, చైతన్యపురి డివిజన్‌లో ఫాగింగ్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పిలుపు మేరకు స్వంత నిధులతో ఫాగింగ్ యంత్రాలు కొనుగోలు చేసి, బుధవారం నుండి ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో నిరవధికంగా ఫాగింగ్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వం కూడా మరిన్ని ఫాగింగ్ యంత్రాలు అందుబాటులోకి తీసుకు వచ్చి దోమల బెడద నుంచి ప్రజలను రక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తోట మహేష్ యాదవ్, శివ ప్రకాష్, లక్ష్మీనారాయణ గౌడ్, విశ్వప్రేమ్ కుమార్ అదాలత్, శ్రీహరి, తులసి కృష్ణ గౌడ్, జలంధర్, పులి కిరణ్, సాయి, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

About The Author