ఫీజుల మోత.. పేరెంట్స్ ఆగ్రహం!
హేచ్.పీ.ఎస్ (హైదరాబాద్ పబ్లిక్ స్కూల్) ముందు ధర్నా.. ఫీజులు ఫ్రీజ్ చేయాలని డిమాండ్.
*హైదరాబాద్:
నగరంలోని ప్రైవేట్ పాఠశాలల్లో విపరీతంగా పెరుగుతున్న ఫీజులపై తల్లిదండ్రులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఫీజుల దోపిడీని అరికట్టాలంటూ శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. ముఖ్యంగా రామంతాపూర్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (HPS) ముందు భారీ సంఖ్యలో తల్లిదండ్రులు ధర్నాకు దిగారు.
4 ఏళ్లలో 141 శాతం పెంపా?*
పాఠశాల యాజమాన్యం తీరుపై తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత నాలుగేళ్ల కాలంలోనే ఫీజులను దాదాపు 141 శాతం పెంచేశారని వారు ఆరోపించారు. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఈ భారం మోయలేనిదిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫీజుల నియంత్రణ:* పెంచిన ఫీజులను వెంటనే తగ్గించి, రాబోయే ఐదేళ్ల వరకు ఫీజుల పెంపు లేకుండా ‘ఫ్రీజ్’ చేయాలి.
*లిఖితపూర్వక హామీ:*ఫీజుల నియంత్రణపై యాజమాన్యం నుంచి స్పష్టమైన రాతపూర్వక హామీ వచ్చే వరకు ‘ఫస్ట్ టర్మ్’ ఫీజులు చెల్లించేది లేదని స్పష్టం చేశారు.
### *తగ్గిన ప్రమాణాలు.. పెరిగిన భారం*
ఫీజులు భారీగా వసూలు చేస్తున్నప్పటికీ, పాఠశాలలో విద్యా ప్రమాణాలు మాత్రం దారుణంగా పడిపోతున్నాయని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస సౌకర్యాలు, పారదర్శకత కరువైందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై నియంత్రణ తీసుకురావాలని కోరారు. లేనిపక్షంలో ఈ ఆందోళనలను రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు హెచ్చరించారు.
About The Author
18 Apr 2026
