తల్లిదండ్రుల ఆస్తిని బదులాయింపు నిబంధనలను పాటించాలి

ములుగు జిల్లా :

WhatsApp Image 2025-09-18 at 6.52.14 PM

తల్లి దండ్రులు, వయో వృద్దులు తమ పిల్లలకు, ఆస్తులను బదులాయింపు సమయంలో వారి మౌలికఅవసరాలు, సౌకర్యాలు తీర్చే నిమిత్తము  ఆస్తిని కానుకుగా లేక, ఏవిధంగా నైనా ఆస్తిని బదలాయించి నపుడు, మౌలిక అవసరాలు,సౌకర్యాలు తీర్చాలి అనే నిబంధనను రిజిస్ట్రేషన్ డాకుమెంటులో తప్పకపొందపరిచేల  తల్లిదండ్రులు వృద్ధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్,నిర్వహణ సంక్షేమం, ములుగు రెవెన్యూ డివిజనల్ అధికారి  గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ పిల్లలు,ఈ నిబంధనలను (వయోవ్రుద్దుని అవసరాలు, సౌకర్యాలు ) తీర్చడములో విఫలం ఐతే ఆ వయోవృద్దుని కోరిక మేరకు ట్రిబ్యునల్ (రెవిన్యూ డివిజనల్ అధికారి ) ఆస్తి  బదలాయింపు మోసం , ఒత్తిడి వలన జరిగినట్లుగా భావించి బదలాయింపును తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ  సంక్షేమ చట్టం - 2007, సెక్షన్ 23 (A) ప్రకారం రద్దు చేయబడుతుందని ఆయన పేర్కొన్నారు.

Read More రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన ఐటీ మంత్రి, అధికారులు

About The Author