యాదద్రి లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్న పారిజాత నర్సింహారెడ్డి దంపతులు..
యాదగిరిగుట్ట:
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని శనివారం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు.
ముందుగా స్వయంభూ నారసింహుడిని దర్శించుకున్న వీరు, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ గర్భాలయంలో ముక్కోటి దేవతల సాక్షిగా అర్చకులు వీరికి వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు.
ప్రజలంతా క్షేమంగా ఉండాలి: అనంతరం పారిజాత నర్సింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. యాదద్రి క్షేత్రం ఎంతో దివ్యంగా వెలుగొందుతోందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
