పెన్షన్ భిక్ష కాదు.. అది శ్రమజీవుల హక్కు!
హైదరాబాద్ :
రిటైర్మెంట్ బెనిఫిట్స్ పేరిట ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇస్తున్నామన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అవాస్తవం మాత్రమే కాదు, విశ్రాంత ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. పెన్షన్ అనేది ప్రభుత్వం వేసే ‘భిక్ష’ కాదని, అది ఉద్యోగి తన సర్వీసు కాలంలో దాచుకున్న ‘బకాయి’ అని 1982లోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
GPF, లీవ్ ఎన్‌కాష్‌మెంట్, ఇన్సూరెన్స్ వంటివన్నీ ఉద్యోగుల సొంత సొమ్ములే. కోటి రూపాయలనేది గాలి మాట.. సగటున అందేది 35 నుండి 50 లక్షలు మాత్రమే. విలాసాలకు, ప్రచారాలకు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, బకాయిలు అందక చనిపోయిన 61 మంది పెన్షనర్ల ఆర్తనాదాలను వినకపోవడం శోచనీయం. పాలకులు ఇప్పటికైనా అపోహలు కల్పించడం మాని, విశ్రాంత జీవుల చట్టబద్ధమైన హక్కులను గౌరవించాలి.
_ఇంజమూరి రఘునందన్,
పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు(సెల్:9866102962)
About The Author
26 Mar 2026
