రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలి

వాహనాలపై నిలబడి ప్రయాణం చేయడం ప్రమాదం
సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు, వ్యాపారులు ముందుకు రావాలి- జిల్లా ఎస్పీ నరసింహ

WhatsApp Image 2025-10-28 at 5.28.57 PM

సూర్యాపేట : 

Read More ప్రశంసా పత్రాలు అందుకున్న నిర్మల్ జిల్లా ఎస్పీ పీఆర్వో నరిమెట్ల వంశీ..

ప్రయాణాల సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రజలు జాగ్రత్త పడాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు అధికారుల నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించి గత నెలలో జరిగిన నేరాల స్థితిగతులను సమీక్షించారు. అనంతరం కేసు దస్త్రాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు సలహాలు అందించారు.నేర నిరూపణలో సిబ్బంది సాంకేతిక సామర్థ్యం కలిగి ఉండాలి, పిర్యాదులపై త్వరగా స్పందించి సంఘటనా స్థలానికి త్వరగా చేసుకోవాలి, రాత్రిళ్ళు పెట్రోలింగ్ పటిష్టంగా ఉండాలి, కేసులు పెండింగ్ లేకుండా వేగంగా దర్యాప్తు చేయాలి, కేసుల్లో నేరస్తులకు త్వరగా శిక్షలు పడేలా పని చేయాలి, పోక్సో కేసుల్లో, మహిళా సంభంద కేసుల్లో వేగంగా దర్యాప్తు చేసి కోర్టులతో సమన్వయంగా పని చేసి నేరస్తులకు శిక్షలు పడేలా కృషి చేయాలి. పోలీసు పని విభాగాల్లో సమర్థవంతంగా పని చేయాలి, పోలీసు వేగవంతమైన సేవలు అందించినప్పుడే ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని అన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదంలో ఒక్క ప్రాణం కూడా పోకుండా సిబ్బంది పని చేయాలని ఈ సందర్భంగా దిశా నిర్దేశం చేశారు. నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ వాహన దారులను ప్రజలను రోడ్డు భద్రత పట్ల అప్రమత్తం చేయాలని సూచించారు. నేరాల నివారణలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఎక్కువ మొత్తంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ప్రజలను, వ్యాపారులను ప్రోత్సహించాలి అని తెలిపినారు.ప్రయాణ సమయంలో ప్రజలు వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ప్రమాదాల బారిన పడకుండా  ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వాహనాలపై నిలబడి ప్రయాణం, ఎక్కువ మంది ప్రయాణం చేయడం ప్రమాదమని గుర్తు చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు అక్రమ రవాణాలకు పాల్పడితే అలాంటి వారిని ఉపేక్షించమని హెచ్చరించారు.
పని విభాగాల నిర్వహణలో  అధికారులకు రివార్డ్స్ అందించడం జరిగింది.

Read More సామినేని హంతకుల అరెస్టు చేయాలి..

స్టేషన్ హౌస్ ఆఫీసర్ పని విభాగాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ గత నెలలో కేసుల దర్యాప్తు, ఇన్వెస్టిగేషన్ లో బాగా పని చేసిన కోదాడ పట్టణ ఇన్స్పెక్టర్ శివశంకర్ ను, సూర్యాపేట టూ టౌన్ ఎస్సై శివతేజ ను, అనంతగిరి ఎస్సై నవీన్ కుమార్ లను ఎస్పి అభినందించి రివార్డ్ అనించారు. 

Read More హుజుర్నగర్ ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతా

పోలీసు వాహనాల నాణ్యతను, కండిషన్ ను తనిఖీ చేసిన ఎస్పి నరసింహ బాధితులకు వేగవంతంగా పోలీసు సేవలు అందించడంలో పోలీసు వాహనాలు కీలకం అని ఎస్పి తెలిపినారు, పోలీసు వాహనాలను  తనిఖీ చేశారు. ప్రజలకు సేవలు అందించే అవహనాలు పూర్తి కండిషన్ లో ఉండాలని వాటిని ఎక్కువ కాలం ఉపయోగించాలి ఎప్పటికప్పుడు నాణ్యత పరిశీలించుకోవాలి, సర్వీసింగ్ చేయించాలని డ్రైవర్లకు ఎస్పి సూచించారు. పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయాలని పోలీస్ మోటార్ ట్రాన్స్పోర్ట్ అధికారిని ఎస్పి గారు ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పి రవీందర్ రెడ్డి, సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్, డిసిఆర్బి డిఎస్పి రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ హరిబాబు, ఇన్స్పెక్టర్లు శివశంకర్, ప్రతాప్ లింగం, రామకృష్ణా రెడ్డి, చరమందరాజు, నాగేశ్వరరావు, నరసింహారావు, రాజశేఖర్, వెంకటయ్య, సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, ఎస్సై లు, ఐటి కోర్ సిబ్బంది,డిసిఆర్బి సిబ్బంది ఉన్నారు..

Read More ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ను కలిసిన పెయింటింగ్ అసోసియేషన్ యూనియన్ సభ్యులు

About The Author