బడంగ్‌పేటలో ముమ్మరంగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’

​పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి ఆస్తి పన్ను సకాలంలో చెల్లించాలి: డిప్యూటీ కమిషనర్ సరస్వతి

బడంగ్‌పేటలో ముమ్మరంగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’

బడంగ్‌పేట:

బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ సర్కిల్-16 పరిధిలో ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ కార్యక్రమం సోమవారం ఉత్సాహంగా కొనసాగింది. డిప్యూటీ కమిషనర్ సి. సరస్వతి పర్యవేక్షణలో అన్ని డివిజన్లలోని ప్రభుత్వ సంస్థలు, బహిరంగ ప్రదేశాల్లో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్‌ను నిర్వహించారు.WhatsApp Image 2026-03-09 at 19.38.27 (2)

​ప్రభుత్వ సంస్థల్లో పారిశుధ్య పనులు
​కార్యక్రమంలో భాగంగా బడంగ్‌పేట మహిళా పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణాలను సిబ్బంది శుభ్రం చేశారు. అలాగే దావూద్‌ఖాన్‌గూడ, రాజీవ్ గృహకల్పలోని బస్తీ దవాఖానలు, నాదర్‌గుల్, చింతలకుంట, భాగ్యకలనగర్, చెల్లా లింగారెడ్డి నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలు, డ్వాక్రా భవనాల పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి బ్లీచింగ్ పౌడర్‌ను చల్లారు.

​కాలనీవాసులకు అవగాహన
​అల్మాస్‌గూడలోని సి.ఎం.ఆర్ (CMR) కాలనీలో డిప్యూటీ కమిషనర్ స్వయంగా పర్యటించి స్థానికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె పలు కీలక సూచనలు చేశారు:
​చెత్త సేకరణ: ఇళ్ల వద్దే తడి, పొడి చెత్తను వేరు చేసి స్వచ్ఛ ఆటోలకు అందించాలని కోరారు.

​పన్నుల చెల్లింపు: నగర అభివృద్ధికి సహకరిస్తూ, ఆస్తి పన్నును సకాలంలో చెల్లించి బాధ్యతాయుత పౌరులుగా మెలగాలని సూచించారు.

​ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఈ (SWM) ఎం. అభినయ్ కుమార్, ఏఈ గంగాప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ యాదగిరి, జూనియర్ అసిస్టెంట్ నర్సింహా, పర్యావరణ ఇంజనీర్ రాము, మున్సిపల్ జవాన్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.WhatsApp Image 2026-03-09 at 19.38.27

About The Author