
సూర్యాపేట :
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఈనెల 25వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం అధ్వర్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారధ్యంలో రెండు రోజులు నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా కార్యక్రమం పోలీసు బందోబస్తు, రక్షణ, భద్రత ఏర్పాట్లను పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేశారు.డిఐజి శివహాల్ ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ నల్గొండ ఎస్ పి శరత్ చంద్ర పవర్ తదితరులు పాల్గొని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాబ్ మేళాకు వస్తున్న ప్రతి ఒక్కరికి భద్రత ఏర్పాట్లు చేయాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేవిధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు..