బతుకమ్మ ఉత్సవాలకు బతుకమ్మ కుంట సిద్ధం..
హైదరాబాద్
25న బతుకమ్మకుంటలో బతుకమ్మ సంబురాలు..
ఈ ఉత్సవాల్లో పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి..
ఏర్పాట్లను పరిశీలించిన నేతలు, ఉన్నతాధికారులు..
సర్వాంగ సుందరంగా రూపుదిదుకుంటున్న బతుకమ్మకుంట..

ఈనెల 25 నాడు హైదరాబాద్ మహానగరంలో చరిత్రలో లిఖించదగిన ఒక అపురూప దృశ్యం కనువిందుచేయబోతోంది.. ఎందుకూ పనికిరాదు అనుకున్న ఒక నీటి కుంట మహోన్నత కార్యక్రమానికి వేదిక కాబోతోంది.. అంబర్ పేట్ లో మురికికూపంగా మారిన బతుకమ్మ కుంటాను తిరిగి ఒక అద్భుతమైన వేదికగా మలచారు.. ఈ ఘనత హైడ్రా తన ఖాతాలో వేసుకుంది.. అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారిన బతుకమ్మ కుంట పేరు ఈరోజు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతోంది.. ఈ నెల 25 కోసం నగర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. బతుకమ్మ ఆటలో పాల్గొని ఆనందహేళను అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు..
ఆక్రమణలకు గురై నిర్మాణ వ్యర్థాలతో నిండిపోయి పిచ్చి మొక్కలతో అటువైపు వెళ్లాలంటే కాదు.. కనీసం చూడాలంటే భయపడే విధంగా బతుకమ్మ కుంట మారిపోయింది. కబ్జాల చెర నుంచి విముక్తి చేసి.. సర్వాంగ సుందరంగా బతుకమ్మ కుంటగా తీర్చడంలో హైడ్రా కృషి అభినందనీయం అని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు వి. హనుమంతరావు అన్నారు. కబ్జాల చెర నుంచి విముక్తి చేయడానికి రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ ఎంసీ శాఖలతో సమన్వయం చేసుకుంటూ.. కోర్టుకు వాస్తవాలు వివరించి బతుకమ్మకుంటకు జీవం పోసిన ఘనత హైడ్రాదే అని కొనియాడారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇదో యజ్ఞలా చేశారంటూ అభినందించారు. బతుకమ్మ కుంట ఆక్రమణలను తొలగించి.. చెరువుగా అభివృద్ధి చేయాలని తాము కోరగానే ముఖ్యమంత్రి ఈ పనిని హైడ్రాకు అప్పగించారు.
అందరూ రావాలి.. బతుకమ్మ ఆడాలి :
బతుకమ్మ కుంట పరిసరాలు ఎంతో ఆహ్లాదంగా ఉన్నాయి. ఇక్కడ ఈ నెల 25న జరగనున్న బతుకమ్మ ఉత్సవాలకు అందరూ రావాలి.. బతుకమ్మ ఆడాలి అని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, శ్రీ వి హనుమంతరావు కోరారు. నగరంలో మొదటి విడతగా చేపట్టిన 6 చెరువులలో బతుకమ్మకుంట ప్రథమంగా సిద్ధమవ్వడం ఎంతో ఆనందంగా ఉందని వి. హనుమంతరావు అన్నారు. ఉత్సవాలకు కూడా ముఖ్యమంత్రి వస్తానని చెప్పడం.. ఎంతో ఆనందంగా ఉందన్నారు. పార్టీలకతీతంగా అందరూ వచ్చి.. నగరంలో మరిన్ని చెరువుల అభివృద్ధికి ప్రోత్సహకంగా ఈ ఉత్సవాలు జరగాలని కోరారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో చర్చగా మారిని బతుకమ్మ కుంట అభివృద్ధి .. ఉత్సవాలతో మరోమారు దేశవ్యాప్తంగా మారుమోగాలని కోరారు.
