మునిసిపాలిటీ ఓటర్ జాబితా సిద్ధం : మున్సిపల్ కమిషనర్ సంపత్
20 వార్డులు,14 వేల112 మంది ఓటర్లు
ములుగు :
ములుగుమున్సిపాలిటీ పరిధి లోని తాజా ఓటర్ జాబితాను మున్సిపాలిటీ కమిషనర్ జనగాం సంపత్ రెడ్డి గురువారం అధికారికంగా విడుదల చేశారు. మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉండగా మొత్తం ఓటర్ల సంఖ్య 14 వేల112 మందిని నమోదు చేశారు. వార్డుల వారీగా 1వ వార్డులో 6 వందల 73, 2వ వార్డులో 7 వందల 61, 3వ వార్డులో 7 వందల 54, 4వ వార్డులో 7 వందల 49, 5వ వార్డులో 6 వందల 93, 6వ వార్డులో 6 వందల 51, 7వ వార్డులో 7 వందల 26, 8వ వార్డులో 7 వందల 30, 9వ వార్డులో 6 వందల 30, 10వ వార్డులో 7 వందల 50, 11వ వార్డులో 7 వందల1, 12వ వార్డులో 7 వందల 69, 13వ వార్డులో 7 వందల 8, 14వ వార్డులో 7 వందల 89, 15వ వార్డులో 7 వందల 9, 16వ వార్డులో 6 వందల 59, 17వ వార్డులో 6 వందల 55, 18వ వార్డులో 6 వందల 48, 19వ వార్డులో 6 వందల 33, 20వ వార్డులో 7 వందల 24 మంది ఓటర్లు ఉన్నారు. ఈ గణాంకాల్లో 14వ వార్డులో అత్యధికంగా 7 వందల 89 మంది ఓటర్లు ఉండగా, 9వ వార్డులో అత్యల్పంగా 6 వందల 30 మంది ఓటర్లు ఉన్నట్లు మున్సిపల్ కమిషనర్ సంపత్ వెల్లడించారు. మున్సిపల్ పరిధిలోని ప్రజలు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద అందుబాటులో ఉంచిన ఓటర్ల జాబితాను పరిశీలించి, ఏవైనా పేర్లు చేర్పులు, తొలగింపులు లేదా సవరణలకు ఈ నెల (జనవరి) 5 లోపు అభ్యంతరాలు తెలియజేయాలని అధికారులు సూచించారు. ఈనెల 10న తుది జాబితాను ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డు డివిజన్ అధికారి రమేష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తో పాటు మున్సిపాలిటీ అధికారులు పాల్గొన్నారు.
