ఆటల్లో మెరిసిన దివ్యకు ఆసరా – అంతర్జాతీయ పోటీలకు చేయూత డాక్టర్ పద్మావతి బోస్లే మరియు మేనేజింగ్ డైరెక్టర్ నంద కిషోర్ భోస్లే..

ఆటల్లో మెరిసిన దివ్యకు ఆసరా – అంతర్జాతీయ పోటీలకు  చేయూత డాక్టర్ పద్మావతి బోస్లే మరియు మేనేజింగ్ డైరెక్టర్ నంద కిషోర్ భోస్లే..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా :


బైంసా మండలం సుంక్లీ గ్రామానికి చెందిన దివ్య (తండ్రి: రమేష్) క్రీడా రంగంలో అద్భుత ప్రతిభను కనబరుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బాక్సింగ్‌లో ఇప్పటికే రాష్ట్రస్థాయిలో అనేక పతకాలు సాధించిన దివ్య, తాజాగా అంతర్జాతీయ అర్నిస్ పోటీలకు ఎంపికై జిల్లాకే గర్వకారణంగా నిలిచింది.
జమ్మూ కాశ్మీర్‌లో జరగనున్న అంతర్జాతీయ పోటీలకు హాజరుకావడానికి ఆర్థిక సహాయం అవసరమవడంతో, బైంసాలోని సాక్షి మెటర్నిటీ హాస్పిటల్ ముందుకు వచ్చి మానవీయత చాటింది. హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ పద్మావతి బోస్లే మరియు మేనేజింగ్ డైరెక్టర్ నంద కిషోర్ భోస్లే దివ్యకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఆమె క్రీడా ప్రయాణానికి బలమైన మద్దతుగా నిలిచారు.
“అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించి దేశానికి పేరు తీసుకొస్తాను” అని ఆత్మవిశ్వాసంతో చెబుతున్న దివ్యకు అందిన ఈ చేయూత పలువురిని ప్రశంసించేటట్లు చేసింది. ప్రతిభకు పేదరికం అడ్డుకాకూడదన్న ఉద్దేశంతో ముందుకు వచ్చిన డాక్టర్ల సహృదయతకు స్థానికులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

About The Author

Related Posts