ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వహించాలి

జిల్లా అడిషనల్ కలెక్టర్ కే. చంద్రారెడ్డి

ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వహించాలి

ఎల్బీనగర్:

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వహించాలని రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ కే. చంద్రారెడ్డి మండల సిబ్బందికి తెలిపారు. గురువారం అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి సరూర్ నగర్ మండలం కార్యాలయానికి విచ్చేసి ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కార్యాలయ ఆవరణలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా ఆవరణలో ఎలాంటి చెత్త చెదారం లేకుండా చూడాలని, ప్రజలకు అందుబాటులో ఉండి వారి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. అధికారుల పనితీరుపై సమీక్ష నిర్వహించారు.కాసరా, పహాణి రికార్డు గదిని పరిశీలించి, సిబ్బందికి తగిన సూచనలు చేశారు.ఈ సందర్బంగా అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి మాట్లాడుతూ, కార్యాలయంలో పనిని బట్టి ప్రగతి ప్రణాళికలో భాగంగా రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు చేయవచ్చని, 99 రోజుల ఈ కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరూ ప్రజలకు ప్రతిఫలం కలిగేలా చేయాలనీ, కబ్జాదారుల నుండి ప్రభుత్వ భూములను కాపాడాలంటే మండలానికి గుండె కాయ లాంటి రికార్డు గదిని బాధ్యతగా నిర్వహించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ పి. వేణుగోపాల్, నాయబ్ తహసీల్దార్ ఏ. భాను ప్రసాద్, మండల్ ఆర్ఐ సహాదేవ్ రెడ్డి, రాంబాబు, రమేష్, రషీద్, అఖిల, నవీన్, రికార్డు అసిస్టెంట్ నవీన్ తదితరులు పాల్గోన్నారు.WhatsApp Image 2026-03-12 at 18.41.44 (1)

About The Author