ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి
కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్

సూర్యాపేట :
ప్రజావాణి పిర్యాదులపై అధికారులు సత్వరమే చర్యలు తీసుకొని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు.సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో ఆయన పాల్గొని ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు.ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు తప్పనిసరిగా హాజరై పిర్యాదులపై శాఖల వారీగా ప్రత్యేక శ్రద్ద పెట్టి పరిష్కరించాలని వారం రోజుల్లో ప్రజావాణి పిర్యాదుల స్టేటస్ పై సమీక్ష నిర్వహిస్తనని తెలిపారు.కోర్ట్ కేసులు ఏమైనా పెండింగ్ ఉంటే వెంటనే తదుపరి వాయిదా నాటికి కౌంటర్ పైల్ సిద్ధం చేయాలని ఆదేశించారు.ప్రభుత్వ కార్యాలయాలకు స్థలం అవసరం ఉంటే తెలియజేయాలనీ అలాగే ప్రభుత్వ కార్యాలయాల కి చెందిన భూముల వివరాలు రికార్డ్ లలో అప్డేట్ చేయాలని అన్నారు.జిల్లా స్థాయి అధికారులు, మండల ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలన చేసి శాఖల వారీగా సమీక్షలు నిర్వహించాలని అలాగే పురోగతి పై నివేదికలు వెబ్ లింక్ ద్వారా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని ఆదేశించారు.నషా ముక్తా భారత్ అభియాన్ లో భాగంగా జిల్లాలో మాదక ద్రవ్యాలను అరికట్టుటకై ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం జిల్లాలోని విద్యాసంస్థలలో అలాగే గ్రామ స్థాయి లో ప్రతిజ్ఞ చేపించాలని అధికారులను ఆదేశించారు..
ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ కే. సీతారామారావు , ఆర్డీఓ వేణు మాదవ్,మహిళా సంక్షేమ అధికారి కే. నర్సింహారావు, హౌజింగ్ పిడి సిధార్థ, ఇరిగేషన్ అధికారి,జడ్పీ డిప్యూటీ సి ఈ ఓ శిరీష, డి ఎస్ సి డి ఓ కే. దయానంద రాణి,డి పి ఓ యాదగిరి,డి ఈ ఓ ఆశోక్,డి ఐ ఈ ఓ బాను నాయక్,డి ఎం హెచ్ ఓ వెంకట రమణ,అధికారులు, సిబ్బంది, తదితరులు హాజరైనారు
