ముడి సరుకులు కొనుగోలుకు కొటేషన్లు ఆహ్వానం.

- కలెక్టర్ జితేష్ వి పాటిల్

WhatsApp Image 2026-01-03 at 5.23.40 PM

భద్రాద్రి కొత్తగూడెం :

జిల్లాలోని భద్రాచలం పరిధిలో ఉన్న కృష్ణ సాగర్  ప్రభుత్వ ఐటీఐకి వివిధ కోర్సులకు అవసరమైన రా మెటీరియల్ ముడి సరుకులు కొనుగోలుకు సంబంధించి జిఎస్టి నమోదు కలిగిన అర్హత గల సంస్థల నుండి సీల్డ్ కొటేషన్లను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 05 నుంచి 10 తేదీ వరకు ప్రభుత్వ ఆర్ ఐటిఐ కృష్ణ సాగర్ ప్రిన్సిపాల్ సంచాలకుల కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాక్సులో సీల్డ్ కొటేషన్లను వేయాలని సూచించారు. ఐటీఐకి రూ.3,79,200/బడ్జెట్ కేటాయించి, మెకానికల్ ట్రెడ్ 49, ఎలక్ట్రికల్ ట్రేడ్ 80 రకాల ముడి పదార్థములు కొనుగోలు చేయడానికి కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ఆర్ ఐటిఐ కృష్ణ సాగర్ కార్యాలయం ఫోన్ నెంబర్ 89 1999 61 618 ఫోన్ చేసి తెలుసుకోవాలని ఆయన సూచించారు. జీఎస్టీ నమోదు కలిగిన సంస్థలు మాత్రమే కొటేషన్ సమర్పించాలన్నారు. ట్రేడ్ కోర్సుల వారీగా రా మెటీరియల్ జాబితాను సంబంధిత ఐటీఐ ప్రిన్సిపాల్ నుంచి పొందాలని వివరించారు. నిబంధనల ప్రకారం తక్కువ ధర పేర్కొన్న సంస్థను సరఫరా ఆర్డర్ల కోసం పరిగణిస్తారని ఆయన తెలిపారు.

About The Author