అన్ని హంగులతో రాజీవ్ పార్క్ సుందరికరిస్తాం
సంగారెడ్డి :
- టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
- పార్క్ అభివృద్ధికి మూడు కోట్ల నిధులు మంజూరు
- కన్సల్టెన్సీ డిజైన్ అండ్ ఆర్కిటెక్ట్ ప్రతినిధులతో రాజీవ్ పార్కు పరిశీలించిన నిర్మలజగ్గారెడ్డి దంపతులు
- వచ్చే నెలలో సీఎం ప్రారంభించే దిశగా చర్యలు

పట్టణంలోని రాజీవ్ పార్క్ ను అన్ని హంగులతో సుందరీకరించి త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సోమవారం రాజీవ్ పార్క్ ను టి జి ఐ ఐ సి చైర్ పర్సన్ నిర్మల, డిజైన్ అండ్ ఆర్కిటెక్ట్, కన్సల్టేషన్ ప్రతినిధులతో పరిశీలించారు. అనంతరం జగ్గారెడ్డి మాట్లాడుతూ... 2004 సంవత్సరంలో ఎమ్మెల్యే అయిన తర్వాత 2005లో బొబ్బిలి కుంటను ఆనుకొని ఉన్న స్థలంలో రాజీవ్ పార్కును ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. నాటి ముఖ్యమంత్రులు రాజశేఖర్ రెడ్డి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల హయాంలో పార్క్ పనులు పూర్తయినట్లు తెలిపారు. సమైక్య రాష్ట్రంలో పదేళ్లపాటు ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు సైతం మ్యూజికల్ ఫౌంటెంట్ చిల్డ్రన్ పార్క్ ప్లే ఏరియా వసతులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇక 2014 నుంచి 2018 వరకు పార్కు నిర్వహణ కుంటుపడుతూ వచ్చిందన్నారు. పార్క్ నిర్వాహణపై స్థానికులు ఫిర్యాదులు చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో లేకపోవడం, తాను కూడా ఎమ్మెల్యేగా లేకపోవడంతో అభివృద్ధికి దూరమైందన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తిరిగి నిధులు తీసుకువచ్చి అభివృద్ధికి మార్గం వేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరిగేందుకు ప్రోటోకాల్ ఉండాలి అని తలచిన సీఎం రేవంత్ రెడ్డి తన భార్య నిర్మలకు కార్పొరేషన్ పదవిని ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఇక ఈ మధ్యకాలంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ అండ్ కమిషనర్ శ్రీదేవిని కలిసి పార్క్ అభివృద్ధి విషయాలు చర్చించినట్లు తెలిపారు. రాజీవ్ పార్క్ సుందరీ కర్ణకు 15 కోట్ల రూపాయల ప్రతిపాదనలు ఇవ్వడం జరిగిందన్నారు. తక్షణ పనుల నిమిత్తం మూడు కోట్లు ఇస్తానని హామీ ఇవ్వడంతో తగ్గట్టుగా ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు తెలిపారు. దీంతో మంజూరైన మూడు కోట్లతో కన్సల్టెంట్ ఆర్కిటెక్ట్ తదితర అభివృద్ధి పనులను ప్రతినిధులకు సూచించడం జరిగిందన్నారు. పార్కులో పెరిగిన పిచ్చి గడ్డిని తొలగించి ల్యాండ్ స్కేప్ పనులు చేపట్టాలని సూచించారు. ఉన్న చెట్లను తొలగించకుండా పనులు నిర్వహించాలన్నారు. కొత్త గ్రాస్ చిల్డ్రన్ పార్క్ లేటెస్ట్ సౌకర్యాలను కల్పించేలా చూడాలన్నారు. నేలపై టైల్స్ కాకుండా మందంగా ఉన్న తాండూర్ బండలు వేసి షో కోసం కాకుండా మన్నిక ఉండేలా చూడాలన్నారు. ఇక లైటింగ్ కూడా షో కోసం కాకుండా నాణ్యమైన వాటిని ఏర్పాటు చేయాలన్నారు. పార్కులో అధిక వెలుతురు ఉండేలా హైమాస్టలైట్లు దగ్గరగా ఏర్పాటు చేసేలా సూచించారు. మరి ముఖ్యంగా హై వోల్టేజ్ ఉన్న లైట్ లనే వాడాలన్నారు. ఇక వర్షం నీరు పార్కులో నిలవకుండా వెంటనే బయటకు వెళ్లేలా పరిష్కారం మార్గాలను చూడాలన్నారు. చిల్డ్రన్ పార్క్ లో ఒక ఫీట్ మేర ఫైన్ సౌండ్ ఏర్పాటు చేయాలన్నారు. ఎంట్రన్స్ వద్ద రౌండ్ ఫౌంటెన్ ఉండాలని అవి కూడా మన్నికైనవే అధునాతనమైన లైటింగ్ తో ఏర్పాటు చేయాలని ప్రతినిధులకు జగ్గారెడ్డి సూచించారు. మ్యూజికల్ ఫౌంటెన్ సైతం ఇప్పుడున్న లేటెస్ట్ డిజైన్ వాడాలన్నారు. పురుషులు మహిళలకు వేరువేరుగా ఆరు వాష్రూమ్లను ఏర్పాటు చేయాలన్నారు. రాజు పార్కు చుట్టూ 10 ఫీట్ల మేరకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. పార్కుకు కొత్త ఆర్చి ఏర్పాటు చేయాలన్నారు. జిమ్ పరికరాలను సైతం ఏర్పాటు చేయాలని పేర్మినెంట్గా ఉండేలా చూడాలన్నారు. వాచ్ మెన్ రూమ్ కూడా ఏర్పాటు చేయాలన్నారు. పార్క్ లో సేన తీరేందుకు లేటెస్ట్ స్టోన్ పెంచ్ అమర్చాలన్నారు. కొత్తగా 160 కె.వి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని ఎలక్ట్రిసిటీ అధికారులకు సూచించారు. అక్టోబర్ నెలలో పార్క్ సుందరీకరణ పనులను పూర్తి చేసి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఇదే నెలలో 25వ తేదీన నిర్వహిస్తామన్నారు. ఈ మేరకు పార్కు నిర్వహణ అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపాదికన రాత్రింబవళ్లు పూర్తిచేసేలా చూడాలన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు దామోదర రాజనర్సింహ ఇన్చార్జి మంత్రి వివేకలు హాజరవుతారన్నారు. రాజీవ్ పార్క్ అందుబాటులో లేకపోవడంతో సరైన సౌకర్యాలు లేక నిర్వహణకు దూరమైందన్నారు. ప్రజలకు అన్ని సౌకర్యాలతో పార్కును అందుబాటులోకి తెస్తామన్నారు. పిల్లలు ఉత్సాహంగా పార్కులో ఉండేలా పార్కులో ఫౌంటెన్ సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు వర్క్ మోడ్లో ఉండేలా చూడాలన్నారు. పాత మ్యూజికల్ ఫౌంటెన్ స్థానంలో కొత్త దానిని ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెల 30న ఆర్కిటెక్ట్ డిజైన్ ఫైనల్ చేసేందుకు హైదరాబాద్లో కన్సల్టెంట్ కార్యాలయంలో సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆయా శాఖల ప్రతినిధులు, స్థానిక నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.
