బోనకల్ షైన్ హై స్కూల్ లో ఘనంగా రాఖిపూర్ణిమ వేడుకలు.

స్థానిక షైన్ హై స్కూల్ లో రాఖిపూర్ణిమ వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నారు...విద్యార్థులుఅందరు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.బాలికలు అందరు బాలురకు రాఖీలను కట్టారు.. ఈ సందర్బంగా పాఠశాల కరెస్పాండంట్ అన్సార్ పాషా మాట్లాడుతూ, ధర్మ పరిరక్షణ ప్రభోదమే రాఖి అని, శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకోవడం సంప్రదాయం అన్నారు. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా సోదరుల చేతికి రాఖి కట్టి, వారు చేపట్టే ప్రతి పని విజయవంతం కావాలని సోదరి ఆశిస్తుంది అన్నారు. ఈ కార్యక్రమం లో కరస్పాండంట్ అన్సార్ పాషా, డైరెక్టర్ లాల్ మియా, ప్రిన్సిపాల్ శ్వేత, అడ్మినిస్ట్రేషన్ నాగేశ్వరావు, ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
About The Author
15 Nov 2025
