సీనియర్ తెలంగాణ జర్నలిస్టుల ఇండ్లకే రేవంత్ గురి..!
హైదరాబాద్:
మూసీ సుందరీకరణ పేరిట లక్షన్నర కోట్లు కొల్లగొట్టే ప్లాన్ వేసి వేలాది పేదోళ్ల ఇళ్లను కూలగొట్టేందుకు వేసిన ప్లాన్, తీవ్ర ప్రజా వ్యతిరేకత వల్ల బెడిసి కొట్టడంతో కొన్నాళ్ల పాటు నిశ్శబ్దంగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ పంజా విసిరారు. ఈసారి మూసీ సుందరీకరణలో భాగంగా దేశంలోనే ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని 5 వేల కోట్ల ప్రజా ధనం వెచ్చించి నిర్మించే పని మొదలుపెట్టాడు. దీని కోసం ఈ వారం చుట్టుపక్కల ఉన్న కొన్ని అపార్ట్‌మెంట్లు, భూములకు భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేశారు. ముఖ్యంగా అందులో లంగర్ హౌజ్ వద్ద ఉన్న మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ కూడా ఉండటం పలువురిని షాక్‌కు గురి చేసింది. ఎందుకంటే తెలంగాణలో ఎంతో పాపులర్ జర్నలిస్టులు, మేధావులు నివసించే అపార్ట్‌మెంట్ అది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఘంటా చక్రపాణి, ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ కె. శ్రీనివాస్, ప్రముఖ యూట్యూబర్ చందు తులసి, రేవంత్ రెడ్డికి కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించిన ఆర్టిస్ట్ రమణా రెడ్డి, ఇంకెందరో ప్రముఖ జర్నలిస్టులు ఇదే అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో నివసిస్తూ ఉంటారు.
ఈ వార్త బయటికి పొక్కడంతో ఒక్కసారిగా తెలంగాణలో అలజడి రేగింది. సామాన్యుల ఇండ్ల మీదికి గత రెండేళ్లుగా బుల్డోజర్లు పంపుతున్న రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా తెలంగాణలో ప్రముఖ జర్నలిస్టులను, మేధావుల ఇండ్లను టార్గెట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.దేశ చరిత్రలోనే బహుశా తొలిసారిగా ఒక విగ్రహం పెట్టడానికి 15 ఏళ్ల క్రితమే కట్టిన అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌ను కూలగొట్టడానికి ప్లాన్ వేసిన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అపఖ్యాతి సాధిస్తున్నాడు. గౌరవ కింగ్ అనుముల రేవంత్ రెడ్డి, మీరు మా అపార్ట్‌మెంట్లను కూల్చడానికి మీ బుల్డోజర్‌ను పంపించాలని నోటీసులు ఇచ్చారు.450 కుటుంబాలు మీ బుల్డోజర్ కిందనే పడుకుంటాయి. దయచేసి దానిని మాపై నడపండి, అప్పుడు మీరు మొత్తం భారతదేశంలో కింగ్ గా ప్రసిద్ధి చెందుతారు.గాంధీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయనున్నందున ఇల్లు ఖాళీ చేయాలని నోటీసులు అందుకున్న మధు పార్క్ అపార్ట్‌మెంట్స్‌కు చెందిన ఒక వృద్ధ నివాసి.5 వేల కోట్ల గాంధీ విగ్రహం కావాలంటే రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర పెట్టుకోమని చెప్పండి
కష్టపడి పైసా పైసా కూడాబెట్టి మేము ఇల్లు కట్టుకుంటే మీ ఇష్ట ప్రకారం ఖాళీ చేయండి అంటే ఎలా?రూ.5000 కోట్లతో మూసీ నది ఒడ్డున భారీ గాంధీ విగ్రహం ఏర్పాటు కోసం ఈసి, మూసీ నదుల సంగమం వద్ద ఉన్న పది ఎకరాల భూసేకరణకు నోటీసులు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మీరు మూసీని సుందరీకరణ చేసుకోడానికి 450 కుటుంబాలను రోడ్డు మీద పడేస్తాను అంటే మేము ఎక్కడికి వెళ్ళాలి.
ప్రభుత్వమే ఇలా చేస్తే మేము ఇంక ఎవరికి చెప్పుకోవాలి..?
మహాత్మా గాంధీ ఏమైనా నాకు విగ్రహం కావాలని అడిగారా.. మీ గొప్పల కోసం మీరు చేసి మమ్మల్ని రోడ్డున మీద పడేస్తానంటే ఇదెక్కడి ఎక్కడి న్యాయమని గగ్గోలు పెడుతున్నారు అపార్ట్మెంట్ వాసులు...
