రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమం విజయవంతం

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నిర్వహణ.

WhatsApp Image 2025-10-31 at 6.54.19 PM

రాజన్న సిరిసిల్ల : 

Read More సిరల గ్రామపంచాయతీని సందర్శించిన ఎంపీఓ జదవ్ ప్రదీప్.

సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా నుండి బతుకమ్మ ఘాట్ వరకు నిర్వహించిన “రన్ ఫర్ యూనిటీ”  శుక్రవారంకార్యక్రమంలో విద్యార్థులు,యువత పోలీస్ అధికారులు, సిబ్బందితో కలసి జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ దేశ ఐక్యత, సమగ్రతకు సర్ధార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి చరిత్రలో చిరస్మరణీయమని, ఆయన ఆలోచనలు, స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకమని తెలిపారు.“రన్ ఫర్ యూనిటీ” వంటి కార్యక్రమాల ద్వారా జాతీయ ఐక్యత పట్ల ప్రజల్లో చైతన్యం పెంపొందుతుందని ఎస్పీ పేర్కొన్నారు.యావత్ భారతావనిలోని ప్రజలందరూ ఒకే కుటుంబ సభ్యులుగా భావించి, జాతి ఐక్యతకు పునరంకితమై, మాతృదేశ సేవలో తమ వంతు పాత్ర పోషించడం ద్వారానే స్వాతంత్ర్య సమరయోధులకు నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుందని అన్నారు.ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, బెటాలియన్ కమాండెంట్ సురేష్,సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి,అసిస్టెంట్ కమాండెంట్ లు రాందాస్ , ఎస్. సురేష్ ఇన్స్పెక్టర్ లు కృష్ణ, నాగేశ్వరరావు, ఆర్.ఐ లు మధుకర్, రమేష్, యాదగిరి, ఎస్.ఐ లు,కిరణ్ కుమార్, శ్రీకాంత్, శ్రావణ్ యాదవ్, సాయి, శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది, బెటాలియన్ సిబ్బంది, విద్యార్థులు, యువత క్రీడాకారులు పాల్గొన్నారు.

Read More భైంసా నూతన ఎంపీఓ గా జాదవ్ ప్రదీప్ బాధ్యతలు స్వీకారం.

About The Author