పదవుల కోసం ప్రజలను మోసం చేస్తున్నారు : శేషగిరి
ములుగు జిల్లా :

పదవి వ్యామోహంతో తనదైన నటన రాజకీయాలతోఎవరు ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారో ములుగుని యోజకవర్గ ప్రజలకు తెలుసునని బిఆర్ఎస్ పార్టీ తాడువాయి గ్రామ అధ్యక్షుడు కొర్నిబెల్లి శేషగిరి సోమవారం ఒక ప్రకటనలో దుయ్యబట్టారు.
తాడ్వాయి సహకార సంఘం అధికారులను బెదిరించి తను 40 యూరియా బస్తాలు తీసుకోవడం ప్రజలను మోసం చేయడం కాదా అని అన్నారు.
రైతులు యూరియా బస్తా కోసం క్యూ లైన్ లో నిలబడి ఒక బస్తా తీసుకుంటే మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణీ ఏకంగా 40 బస్తాలు దండుకోవడం బాధ్యత పదవులు ఉండి ప్రజలను మోసం చేసినట్లు కాదా? అని శేషగిరి ప్రశ్నించారు. నాశనం అయ్యేది నాగజ్యోతి
కాదు ప్రజల కి అందమైన అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచి రైతులకి సరిపడ యూరియా అందించలేని మీ నాయకురాలు అదే వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్మెన్ గా ఉన్న రేగా కళ్యాణిలకు రైతుల ఉసురు తగిలి సర్వనాశనం అయిపోతారని వారిపై విరుచుకుపడ్డారు. పచ్చ కళ్ళ వాళ్లకి లోకం అంత పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టుగా మీరు ప్రతిపక్షం లో ఉన్నప్పుడు చేసిన నటన రాజకీయాలే అందరూ చేస్తారు అని అనుకోవడం మీ మూర్ఖత్వం
రైతు దేశానికే వెన్నముక్క అని అందరికి తెలుసు మరి అలాంటి రైతులకి సరిపడ యూరియా ఇవ్వలేని దద్దమ్మలు ఎవరు రేగ కళ్యాణి
ప్రజలను ఆదుకోవాల్సిన ఒక బాధ్యత గల పదవిలో ఉండి ఇలా ప్రతిపక్ష నాయకులు పైన విమర్శలు చెయ్యడం మీ మూర్ఖత్వం మీకు ఉన్న మార్కెట్ కమిటీ చైర్మెన్ పదవి కాంగ్రెస్ పార్టీ కమిషన్ల కోసం కాకుండా ములుగు జిల్లా ప్రజల కోసం వాడితే మంచిద న్నారు.
అదునుదాటాక,పంట ఆగమయ్యాక యూరియా బస్తానో ఏం చేయాలని రైతులువాపోతున్నారు.
ప్రగల్భాలు మాని మీకు దమ్ముంటే క్యూలైన్ లో నిలబడుతున్న రైతుల దగ్గరికి వెళ్లి మాట్లాడండి అప్పుడు వాళ్లే మీకు సరైనా బుద్ధి చెబుతారు. ములుగు నియోజకవర్గ ప్రజలు వాస్తవాలను గ్రహిస్తున్నారు,వాళ్లే మీకు భవిష్యత్తులో తగిన గుణపాఠం తప్పదు.
