
ఖమ్మం బ్యూరో :
వి వెంకటాయపాలెం గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఘన విజయం సాధించిన కాపా ఆదినారాయణకు వారి గ్రామం వెళ్లి బుధవారం సత్కరించిన కాంగ్రెస్ జిల్లా సీనియర్ నాయకులు శెట్టి రంగారావు.
ఈ సందర్భంగా శెట్టి మాట్లాడుతూ..... కాకలు దీరిన యెాధుల మధ్య తిరిగిన ఘనుడిని ఆనాడే పోస్ట గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఉన్నత విద్యావంతుడు కాపా ఆదినారాయణ అని తను రాజకీయ రంగంలో తను నమ్ముకున్న పార్టీని ప్రజలను వదలకుండా పనిచేయడం వలన గెలుపు తనకు వచ్చిందని అన్నారు. రాజకీయ పదవులు మరియు ప్రజాప్రతినిధి పదవులు తనకు కొత్త కాదని అది అందరికి దక్కదని కాపా ఆదినారాయణ లాంటివారికి ఎప్పుడు దక్కుతాయని నూతన సర్పంచిగా కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఆదినారాయణకు గెలిపించిన ప్రజలకు అభినందనలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో శెట్టి రంగారావుతో పాటు నాంపల్లి శంకరయ్య, నరసింహారావు, జంగాల శ్రీనివాసరావు, గ్రామ నాయకులు వున్నారు.