యువతకు స్ఫూర్తిప్రదాత శివాజీ మహారాజ్

మన్సూరాబాద్‌లో ఘనంగా జయంతి వేడుకలు: మాజీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి

యువతకు స్ఫూర్తిప్రదాత శివాజీ మహారాజ్

మన్సూరాబాద్


హిందూ స్వరాజ్య స్థాపకుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు మన్సూరాబాద్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పలు కూడళ్లలో శివాజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

​ఘన నివాళి - ప్రధాన ప్రాంతాలు: డివిజన్‌లోని జడ్జస్ కాలనీ ఫేస్-1 శివాజీ పార్క్, సహారా రోడ్డులోని తంగిరాల అపార్ట్‌మెంట్స్, హయత్ నగర్ శివాజీ చౌరస్తా, బి.ఎన్. రెడ్డి నగర్ శివాజీ కాలనీలతో పాటు రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి నివాసం వద్ద ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
​పోరాట పటిమ చిరస్మరణీయం: ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అచంచల ధైర్యం, శౌర్యంతో ధర్మ పరిరక్షణకు ఆయన చేసిన పోరాటాలు భారత చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు. శివాజీ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ధర్మ మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.WhatsApp Image 2026-02-19 at 19.20.29

​ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు విశ్వహిందూ పరిషత్ (VHP) నాయకుడు రావినూతల శశిధర్, వనపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు కళ్లెం నవజీవన్ రెడ్డి, మొద్దు లచ్చిరెడ్డి పాల్గొన్నారు. అలాగే బిజెపి నాయకులు కళ్లెం రవీందర్ రెడ్డి, వివిధ కాలనీల అధ్యక్షులు కళ్లెం శంకర్ రెడ్డి, యాస శ్యాంసుందర్ రెడ్డి, కృష్ణ గుప్తా, మాధవరెడ్డి, సాయిలు గౌడ్, హరినాథ్, ప్రమోద్ రెడ్డి, రాజు యాదవ్, కడారి యాదగిరి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

About The Author