ఢిల్లీ సభలో 'పాలమూరు' గర్జన: జాతీయ యువ పార్లమెంటుకు శివంత్ రెడ్డి ఎంపిక!
- సౌత్ ఇండియా నుంచి ఎంపికైన ఏకైక ప్రతినిధిగా గుర్తింపు*
- జాతీయ యువ పార్లిమెంట్ లో రాజ్యసభ వేదికగా 'వేమ్ నరేంద్ర రెడ్డి' పాత్రలో సమాఖ్య స్ఫూర్తిపై పోరు*
- ఏప్రిల్ 9, 10 తేదీల్లో దేశ రాజధానిలో 'సంసద్ 2026' మేధోమథనం*
హైదరాబాద్:
తెలంగాణ యువ కిశోరం జాతీయ వేదికపై తన వాగ్ధాటిని ప్రదర్శించేందుకు సిద్ధమైంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రతిష్ఠాత్మక నిర్వహించనున్న ‘సంసద్ 2026’ జాతీయ యువ పార్లమెంటుకు పాలమూరు బిడ్డ, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి *శివంత్ రెడ్డి* ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా కఠినమైన వడపోత అనంతరం, దక్షిణ భారతదేశం నుంచి ఎంపికైన ఏకైక యువ ప్రతినిధిగా శివంత్ రెడ్డి నిలవడం విశేషం. ఏప్రిల్ 9, 10 తేదీల్లో డిల్లీ కన్నాట్ ప్లేస్‌లోని ఎన్‌డీఎంసీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే ఈ సదస్సులో ఆయన తన గళాన్ని వినిపించనున్నారు.
రాజ్యసభలో 'నవ' దిశ: వేమ్ నరేంద్ర రెడ్డి పాత్రలో..
ఈ యువ పార్లమెంటులో శివంత్ రెడ్డి ఒక కీలక బాధ్యతను భుజానికెత్తుకున్నారు. సీనియర్ నాయకులు *వేమ్ నరేంద్ర రెడ్డి* పాత్రను పోషిస్తూ, రాజ్యసభ వేదికగా కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై విశ్లేషణాత్మక ప్రసంగం చేయనున్నారు. ముఖ్యంగా 'సమాఖ్య స్ఫూర్తి - రాష్ట్రాల హక్కులు' అనే అజెండాతో కేంద్రం వైఖరిని ఎండగట్టడమే కాకుండా, భవిష్యత్తు తరాలకు అవసరమైన పరిష్కార మార్గాలను ఆయన ప్రతిపాదించనున్నారు.
కేవలం రాజకీయ నేపథ్యం మాత్రమే కాకుండా, సామాజిక అంశాలపై పట్టు, అద్భుతమైన ప్రసంగ కళ శివంత్ రెడ్డిని ఈ స్థానంలో నిలబెట్టాయి. తెలంగాణలోని నిరుద్యోగ సమస్యలు, రైతాంగ ఇబ్బందులపై ఆయన నిరంతరం సాగిస్తున్న పోరాటమే ఆయన్ను సౌత్ ఇండియా నుంచి ఏకైక ప్రతినిధిగా నిలిపింది. ఈ ఏప్రిల్ 9, 10 తేదీలో ఢిల్లీ వేదికగా శివంత్ రెడ్డి చేసే ప్రసంగం దేశ యువతకు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
