గోనెపల్లిలో ఘనంగా సీత రాముల కళ్యాణం

గోనెపల్లిలో ఘనంగా సీత రాముల కళ్యాణం

సిద్దిపేట:

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనెపల్లి గ్రామంలో హనుమాన్ దేవాలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ ఉత్సవంలో మహిళలు, గ్రామస్తులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారి దివ్య కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వహకులు,
భక్తులు మాట్లాడారు.సీతారాముల కళ్యాణం దైవికతకు, ధర్మానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. శ్రీరాముడు, సీతమ్మ వారి వివాహం మనకు సత్యం, న్యాయం, పరస్పర గౌరవం వంటి విలువలను నేర్పుతుందని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఈ కళ్యాణాన్ని భక్తి భావంతో నిర్వహించడం వల్ల గ్రామానికి శాంతి, సౌభాగ్యం కలుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇలాంటి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని, యువత కూడా ఈ సంప్రదాయాలను కొనసాగించాలని కోరారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు కార్యక్రమంలో  హనుమాన్ దేవాలయ కమిటీ అధ్యక్షులు శ్రీకాంత్ ,హరి, అశోక్,శ్రీను,శేఖర్, మధుసూదన్ రెడ్డిశ్రీనివాస్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, రాజేందర్, తదితరులు పాల్గొన్నారు .

About The Author

Related Posts