చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పంట కాలువల నిర్మాణానికి భూసేకరణ

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

WhatsApp Image 2025-10-31 at 6.28.45 PM

భూపాలపల్లి : 

Read More నేటి భారతం :

చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పంట కాలువలు నిర్మాణానికి  భూసేకరణ, ఎంజాయ్‌మెంట్‌ సర్వేపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ  భూపాలపల్లి జిల్లా ఐడిఓసి కార్యాలయంలో రెవెన్యూ, ఇరిగేషన్, మెగా అధికారు లతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కెనాల్స్ నిర్మాణానికి మొత్తం ఎంత మంది రైతుల భూములు ప్రభావితం అవుతున్నాయి, ఎన్ని ఎకరాల భూమి అవసరం అవుతుంది అనే అంశాలపై  ఖచ్చితమైన నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. గత వారం నిర్వహించిన సమీక్షలో ఇచ్చిన సూచనల మేరకు, ఈ వారం నాటికి ఎంజాయ్‌మెంట్‌ సర్వే పురోగతిని అడిగి తెలుసుకున్నారు.

Read More పి డి ఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షుడిగా బి. రాకేష్

సర్వే వివరాల్లో ప్రభావిత గ్రామాలు, సర్వే నంబర్లు, రైతుల వారీగా భూమి వివరాలు, పంటల సాగుపై నివేదికలు సిద్ధం చేయాలని తెలిపారు. రైతుల‌కు న్యాయప‌రమైన పరిహారం అందించే ప్రక్రియ పారదర్శకంగా జరగాలని, ఎవరికి అన్యాయం జరగకుండా తగు చర్యలు చేపట్టాలని సూచించారు.

Read More ఎన్నికలలో రిటర్నింగ్ ఆఫీసర్లు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి

రైతులతో చర్చలు జరిపి, భూసేకరణకు సంబంధించిన సమాచారం స్పష్టంగా వివరించాల‌ని, నియమాలు మరియు పరిహార విధానాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. భూసేకరణ కారణంగా రెవెన్యూ రికార్డుల్లో వచ్చే మార్పులను ప్రతీ మండల స్థాయిలో సమన్వయంతో నమోదు చేయాలని కూడా సూచించారు.

Read More పి డి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శిగా జి. సురేష్

కెనాల్ నిర్మాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా అత్యంత వేగంగా సాగేందుకు, సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అధికారులు తెలిపారు.

Read More కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందా..? బీ.ఆర్.ఎస్. ఉనికిని చాటుకుంటుందా..? బీజేపీ బలపడిందా..?

ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఏటిసి రమేష్, ఇరిగేషన్ ఇంజనీర్లు, మహదేవపూర్, కాటారం, మల్హర్, మహా ముత్తారం మండలాల తహసీల్దార్లు, మెగా కంపెనీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read More సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు

About The Author