మేడారం మహాజాతరకు ప్రత్యేక బస్సులు..

WhatsApp Image 2025-12-27 at 8.01.26 PM

జయశంకర్ భూపాలపల్లి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందు పత్రిక సమావేశం ఏర్పాటు మాట్లాడుతూ జిల్లా ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త తెలియజేశారు .. TGSRTC భూపాలపల్లి డిపో నుండి మేడారం మహాజాతరకు ముందుగానే ప్రత్యేక బస్సుల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ బస్సులు భూపాలపల్లి నుండి చెల్పూర్, ఘనపూర్, ములుగు, గోవిందరావుపేట, పస్రా, తాడ్వాయి మీదుగా మేడారం వరకు ప్రయాణిస్తాయి.

భూపాలపల్లి నుండి మేడారం బస్సు టైమింగ్స్:
08:00, 09:00, 16:10, 17:10 గంటలకు.

మేడారం నుండి భూపాలపల్లి బస్సు టైమింగ్స్:
10:40, 11:40, 18:45, 19:45 గంటలకు.

ఈ ప్రత్యేక బస్సు సర్వీసులపై మహాలక్ష్మి పథకం కూడా వర్తిస్తుందని తెలిపారు. ప్రయాణికుల రద్దీని బట్టి అవసరమైతే అదనపు ట్రిప్పులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ గొప్ప అవకాశాన్ని జిల్లా ప్రజలు మరియు పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి డిపో మేనేజర్ ఎ. ఇందు గారు కోరారు.

About The Author