ప్రణాళిక ప్రకారం స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ చేపట్టాలి

ములుగు జిల్లా ప్రతినిధి :

WhatsApp Image 2025-09-19 at 6.39.08 PM

ప్రణాళిక ప్రకారం స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలిపారు. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్  పై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ సుదర్శన్ రెడ్డి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. వీసి లో పాల్గోన్నారు.

Read More టి జి ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నమనేని జగన్ మోహన్ రావు ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ  ఎస్.ఐ.ఆర్ నిర్వహణ కంటే ముందు ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో 2002 ఎస్.ఐ.ఆర్  డేటా ను 2025 ఎస్.ఎస్.ఆర్ డేటా తో కంపేర్ చేసుకోవాలని ఈ రెండు జాబితాలో కామన్ గా ఉన్న పేర్లు మినహాయించి 2002 తర్వాత ఓటరుగా నమోదైన వారి వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి ధృవీకరించాల్సి ఉంటుందని అన్నారు.

Read More హిందువులు బొందు గాళ్లు అన్నోళ్లు కాలగర్భంలో కలిసిపోయారు

ఎస్.ఐ.ఆర్ నిర్వహణ పై మాస్టర్ ట్రైయినర్ల ద్వారా బూత్ స్థాయి సిబ్బందికి సంపూర్ణ అవగాహన కల్పించాలని అన్నారు.  బీహార్, మహారాష్ట్ర  వంటి రాష్ట్రాల్లో ఇటీవల ఎస్.ఐ.ఆర్ చేయడం జరిగిందని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రిటర్నింగ్ అధికారి, ఏఈఆర్ఓ, డిప్యూటీ తహసిల్దారులు,  బి.ఎల్.ఓ సూపర్వైజర్లతో రెగ్యులర్గా సమావేశాలు నిర్వహించాలని, ప్రతిరోజు లక్ష్యాలను నిర్దేశించుకోని ఎస్.ఐ.ఆర్ చేపట్టేలా కార్యాచరణ తయారు చేయాలని అన్నారు.

Read More నేటి భారతం :

ఈ సమావేశంలో  రెవెన్యూ డివిజనల్  అధికారి వెంకటేష్, ములుగు  తహసిల్దార్ విజయభాస్కర్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపర్ఇండెంట్ సలీం,  సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

Read More రసాయన శాస్త్రంలో పనస మహేష్ కు పీహెచ్డీ

About The Author