అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి..

  • పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టండి..
  • నిర్దేశించిన గడువు లోగా పనులు పూర్తి కావాల్సిందే..
  • పాలకవర్గం సభ్యులు, అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించండి..
  • ఇస్నాపూర్ డంప్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం..
  • ఐదు మున్సిపాలిటీలలో చేపడుతున్న అభివృద్ధి పనుల పై సమీక్ష..
  • పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి.

అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి..

పటాన్‌చెరు:

పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీలలో ఇటీవల శంకుస్థాపన చేసిన 75 కోట్ల రూపాయలు అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని.. పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

శుక్రవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఇస్నాపూర్, ఇంద్రేశం, గడ్డపోతారం, జిన్నారం, గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కమిషనర్లు, ఇంజనీరింగ్ శాఖల అధికారులతో అభివృద్ధి పనుల పైన సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా గత నెలలో ప్రతి మున్సిపాలిటీలో చేపట్టిన 15 కోట్ల రూపాయల అభివృద్ధి పనుల పురోగతిని తెలుసుకున్నారు. 

ఇస్నాపూర్, ఇంద్రేశం, గుమ్మడిదల పరిధిలో 50 శాతం పనులు ప్రారంభమయ్యాయని.. మిగిలిన పనులు అతి త్వరలో ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. 

జిన్నారం మున్సిపల్ పరిధిలో టెండర్లు పొందిన కాంట్రాక్టర్లు పనులు చేయడానికి ముందుకు రాకపోవడంతో పనులు ప్రారంభం కావడంలేదని చైర్మన్ జనార్ధన్, కమిషనర్ నాగేందర్ తెలిపారు. టెండర్లు పొంది.. పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లు అందరినీ బ్లాక్ లిస్ట్ లో పెట్టడంతో పాటు.. తిరిగి టెండర్లు రీ కాల్ చేయాలని ఎమ్మెల్యే జిఎంఆర్ సూచించారు. 

గడ్డపోతారం పరిధిలో మొత్తం 15 పనులకు శంకుస్థాపన చేయగా.. వచ్చే వారంలో అన్ని పనులు ప్రారంభమవుతాయని కమిషనర్ తాన్య తెలిపారు. 

అభివృద్ధి పనుల అంశంలో నిర్లక్ష్యానికి తావు ఇవ్వకూడదని.. నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పనుల పురోగతిని పరిశీలించాలని ఆదేశించారు.

ప్రజలకు జవాబుదారిగా పనిచేసినప్పుడే అధికారులు, ప్రజా ప్రతినిధులపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని తెలిపారు. 

ఇస్నాపూర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెడతామని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. 

అతి త్వరలో మున్సిపల్ పరిధిలో 10 ఎకరాలు కేటాయించి.. బయో మైనింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. 

ప్రతి మున్సిపల్ పరిధిలో పది కోట్ల రూపాయలతో ఫంక్షన్ హాల్ ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సంయుక్తంగా నిధులు అందించనున్నాయని.. ఇందుకు సంబంధించి ఆయా మున్సిపల్ పాలకవర్గాలు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. 

మున్సిపల్ పాలకవర్గం సభ్యులు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుంటూ వారి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. 

ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్లు సుమలత, ప్రమీల, సుష్మ, కుమార్ గౌడ్, జనార్దన్, వైస్ చైర్మన్లు సంధ్య గోవర్ధన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, మహేందర్ గౌడ్, కమిషనర్లు వెంకట కిషన్, అజయ్ రెడ్డి, తాన్య, దశరథ్, నరేందర్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.WhatsApp Image 2026-06-12 at 20.25.26 (3)

About The Author