కోటాలో ఆధ్యాత్మిక పరిమళం
విద్యార్థులకు చిన్న జీయర్ స్వామి ఆశీర్వచనాలు
విద్యార్థులకు భగవద్గీతపై ఓరియంటేషన్ తరగతుల్లో కర్తవ్య బోధన

కరీంనగర్ :
కోట విద్యాసంస్థల్లో ఆధ్యాత్మిక వాతావరణం పరిమిలించింది. పబ్లిక్ స్కూల్, జూనియర్ కళాశాలల్లో శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ జీయర్ స్వామి, ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్, వాల్మీకి విద్యాసంస్థలను చైర్మన్ యాదగిరి శేఖర్ రావులు సందర్శించి కోటా కుటుంబానికి తమ ఆశీర్వాదాలు అందించారు.
ప్రభుత్వ విప్పు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, కోటా విద్యాసంస్థలు విద్యతో పాటు నైతిక విలువలకు పెద్దపీట వేయడం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దుతాయని అన్నారు.
టీఆర్‌ఎస్‌ఎంఏ అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు మాట్లాడుతూ, ఆధునిక విద్యకు ఆధ్యాత్మికతను జోడిస్తేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. కోటా విద్యాసంస్థల కృషిని ప్రశంసిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కోట విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ డి అంజిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను అన్ని రంగాలలో నిష్ణాతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కోట విద్యాసంస్థలు ముందుకు వెళ్తున్నాయని అన్నారు
