పోసాన్ పల్లి గ్రామంలో శ్రీ బీరప్ప - కామరతి కళ్యాణ మహోత్సవం.

  • కన్నుల పండుగగా కల్యాణం
  • వేలాదిగా తరలివచ్చిన భక్తులు
  • బీరప్ప స్వామి దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలి
  • కురుమ సంఘం నాయకులు

పోసాన్ పల్లి గ్రామంలో శ్రీ బీరప్ప - కామరతి కళ్యాణ మహోత్సవం.


సిద్దిపేట:

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం పోసాన్ పల్లి గ్రామంలో కురుమ కులస్తుల సంఘం ఆధ్వర్యంలో శ్రీ బీరప్ప-కామరతి కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు, ఈ కార్యక్రమం పొసన్ పల్లి కురుమ సంఘం అధ్యక్షుడు పుల్ల రాయుడు, పెద్ద కుర్మ రాసురి మల్లయ్య, చిన్న కుర్మ పొన్న బుచ్చయ్య, పుల్ల కుమార్, జమున ముత్తయ్య నేతృత్వంలో ఈ కార్యక్రమాలు ఘనంగా నిర్వహింస్తున్నారు, ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా మంద పోచమ్మ పూజ, మహిళ తీయుట, గద్దెగొర్రెను చేయుట, బియ్యం సుంకుపట్టుట, గంగకు పోవుట రాత్రి లగ్నం, బోనాలు తీయుట, బీరప్ప కామరాతి కళ్యాణం, మంద మీద సరుగు వేయుట, గావు పట్టుట, కాశి రామక్క కథ, గ్యారడి వేషం, ఎల్లమ్మ వేషం, సింగం రాత్రికి నాగవెళ్ళి బోనాలు, అక్క మహంకాళి బోగన్న బీరప్ప కామరాతి వేషాలు, గొర్ల లగ్గాలు, భయ్యన్నకు చేయుట, మైలలు తీయుట, రస్తు పంచుట, లాంటీ కార్యక్రమాలు ఘనంగా నిర్వహింస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి వస్తు రూపేణా, దన రూపేనా సహాయం చేసిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ పండుగను తిలకించడానికి వచ్చిన భక్తులకు, అలాగే గ్రామ ప్రజలపై మా కుల దేవుడు శ్రీ బీరప్ప ఆశీర్వాదం ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోసాన్ పల్లి కురుమ సంఘం నాయకులు, గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2026-04-20 at 19.40.36 (1)

About The Author