శ్రీ సరస్వతీ శిశు మందిర్ మాతృభారతి
కరీంనగర్ :

శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో మాతృమూర్తులచే మాతృభారతి సమావేశం గురువారం నిర్వహించారు.
దేశాభివృద్ధిలో భాగంగా మహిళలను సర్వతోముఖభివృద్ధి చేయడానికి పర్యావరణం పై, కుటుంబ విలువలు, కలిసి మెలిసి పని చేయడం పౌరుల యొక్క విధులను ఆచరించే విధంగా మాతృ మండలి ఏర్పాట్లో భాగంగా మాతృ భారతి కమిటీని మాతృ మూర్తులచే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మాతృభారతిలో 43 మంది మహిళలు పాల్గొన్నారు. సమాజం లో మార్పు కోసం మేమంతా ప్రయత్నిస్తామన్నారు. ఇందులో భాగంగా కరినగర్ విభాగ్ మాతృ భారతి సంయోజకులు సాంబ శివరావు, విభాగ్ కార్యదర్శి మేచినేని దేవేందర్ రావు, కాటం రవీందర్ మార్గదర్శం చేశారూ. ఈ కార్యక్రమంలో ప్రధాన చార్యులు సముద్రాల రాజమౌళి, కోల అన్నారెడ్డి, డాక్టర్ చక్రవర్తుల రమణాచారి, ఎలగందుల సత్యనారాయణ, రాపర్తి శ్రీనివాస్, గట్టు శ్రీనివాస్, కొత్తూరి ముకుందo, గోలి పూర్ణ చందర్, డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్, పులాల శ్యామ్, నడిపెల్లి దీన్ దయాల్ రావు, అప్పిడి వకులాదేవి, తదితరులు పాల్గొన్నారు.
