శ్రీ వాసన్స్ అకాడమీ 10వ వార్షికోత్సవం: నూతన శాఖ ప్రారంభం
బాలాపూర్:
నాదర్గుల్ గ్రీన్ హోమ్స్ కాలనీ సమీపంలోని శ్రీ వాసన్స్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్స్‌లో అకాడమీ 10వ వార్షికోత్సవ వేడుకలు, నూతన శాఖ ప్రారంభోత్సవం నిర్వహించారు. అకాడమీ చైర్మన్ వాణి, మేనేజింగ్ డైరెక్టర్ సంపత్ కుమార్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.
*సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ప్రారంభం
మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, రిబ్బన్ కట్ చేసి నూతన అకాడమీ శాఖను ప్రారంభించారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు.
పది సంవత్సరాలుగా విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందిస్తున్న శ్రీ వాసన్స్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ ఇప్పటికే పలు ప్రాంతాల్లో సేవలను విస్తరించిందని అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ సంపత్ కుమార్ తెలిపారు. తాజాగా నాదర్గుల్‌లో నూతన శాఖను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. అకాడమీలో కరాటే, డ్యాన్స్, మ్యూజిక్, ట్యూషన్లు, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తున్నామని, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి వార్షికోత్సవంలో సర్టిఫికెట్లు అందజేశామని వివరించారు.
*హాజరైన ప్రముఖులు
ఈ వార్షికోత్సవ వేడుకల్లో కరాటే రంగానికి చెందిన నరేంద్ర, శ్రీనివాస్, సాయి కుమార్, అశోక్ చక్రవర్తితో పాటు స్థానిక రాజకీయ నాయకులు యల్చల మమత సుదర్శన్ రెడ్డి, ఇంద్రసేన, కోటగిరి జంగయ్య, కుమార్ గౌడ్, నరేష్ చారి, లక్ష్మీ యాదవ్ తదితరులు పాల్గొని అకాడమీ అభివృద్ధికి శుభాకాంక్షలు తెలిపారు..jpeg)
