ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులచే స్వయం పరిపాలన దినోత్సవం..

ప్రభుత్వ పాఠశాలలో  విద్యార్థులచే స్వయం పరిపాలన దినోత్సవం..

నాగర్ కర్నూల్ జిల్లా:

నాగర్ కర్నూల్ నియోజకవర్గం 
బిజినపల్లి మండల పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలోనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నాడు విద్యార్థులచే స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఇందులో జిల్లా కలెక్టర్ గా ఎండి సోహెల్, ఆర్జేడిగాడి.దీప్తి,అడిషనల్ కలెక్టర్ గా ఎన్.జ్యోతి, డీఈవోగా గీత ఎంఈఓగా శ్రేయ,పాఠశాల హెడ్మాస్టర్ గా తులసి బాధ్యతలు నిర్వహించారు.28 మంది ఉపాధ్యాయులుగా 8 మంది సిబ్బంది బాధ్యతలు నిర్వహించారు.విద్యార్థులు చక్కగా ఉపాధ్యాయులు మాదిరిగా తయారై తరగతి గదులలో చక్కటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉపయోగించి పాఠ్యాంశాలను బోధించారు.విద్యార్థులు వాటిని శ్రద్ధగా విన్నారు. ఉపాధ్యాయులు నేటి విద్యార్థి ఉపాధ్యాయుల బోధనను పరిశీలించడం జరిగింది.ఒకరోజు ఉపాధ్యాయులుగా వ్యవహరించడం ద్వారా విద్యార్థులకు ఉపాధ్యాయుల యొక్క బాధ్యతలు తెలియడం కోసం భవిష్యత్తులో ఉపాధ్యాయులుగా రావడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు జీ.మురళి మోహన్ చార్యులు అన్నారు.చక్కగా బోధించిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.ఈకార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు హనుమంతు రెడ్డి,యాదగిరి రావు,చంద్రమోహన్ రెడ్డి, పరమేశ్వరయ్య, నూరుద్దీన్,కృష్ణకుమార్, వెంకటస్వామి,హుస్సేన్, నాగిరెడ్డి,సతీష్ రెడ్డి, శేఖర్,భవిత,జయలక్ష్మి, లక్ష్మీపతి,రాకేష్, విద్యార్థులు పాల్గొన్నారు.

About The Author