గాంధీ చిత్రపటాలతో సుడా చైర్మన్ రెడ్డి నిరసన

WhatsApp Image 2025-12-28 at 2.59.25 PM

కరీంనగర్ : 
జాతీయ ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు తొలగించడం పై సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి నిరసన కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్ రూరల్ మండలం దుబ్బపల్లి గ్రామ సర్పంచ్ మోతె ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి  నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యం కోసం పరితపించిన మహాత్మా గాంధీ పేరుతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చిందని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్ర పన్నిందని ఆ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగిస్తూ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో చర్లభుత్కూర్ సర్పంచ్ కూర నరేష్ రెడ్డి, చామనపల్లి సర్పంచ్ బోగోని ఐలయ్య, ఫకీర్ పేట్ సర్పంచ్ బొద్దుల విజయలక్ష్మి లక్ష్మణ్, ఉపసర్పంచులు అలువాల శ్రీకాంత్, బరిమద్దుల మధు, నాయకులు జగ్గాని కనుకయ్య, బుర్ర గంగయ్య, దీకొండ గంగయ్య, గాదె శ్రీకాంత్ రెడ్డి, వార్డు సభ్యులు ప్రేమలత, విజయలక్ష్మి, ప్రశాంత్, అనిత మహిళలు పాల్గొన్నారు.

About The Author

Related Posts