ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం.
జెండాను ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఉమ్మడి వరంగల్ :

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా హన్మకొండ జిల్లా ఐడిఓసి ప్రాంగణంలో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవిన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరై ముందుగా అదాలత్ సర్కిల్లోని అమరవీల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు అనంతరం హన్మకొండ జిల్లా ఐడిఓసి ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. తదుపరి జిల్లా అభివృద్ధిపై ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ , జిడబ్ల్యూఎంసి కమీషనర్ చాహత్ బాజ్ పేయి, కడా చైర్మన్ ఇనగాల వెంకట్రామి రెడ్డి, గ్రంధాలయ చైర్మన్ అజీజ్ ఖాన్, ఇతర అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గోన్నారు.
