
వేములవాడ :
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ముసివేత పై పలు ఛానలలో సోషల్ మీడియా వేదికగా బుధవారం ప్రసారం కావడం రాజన్న భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని,ఆలయ పరిరక్షణ సమితి సభ్యులు పోతు అనిల్ అన్నారు.బుధవారం ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి పేరుతో రోజుకో విధంగా ఆలయ అధికారులు ప్రవర్తించడం వారి మనోభావాలతో ఆటలాడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్తీక మాసం లో శివయ్యకు భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో దీపారాధన పూజలు నిర్వహిస్తారని,వారి మనోభావాలను గుర్తించి మహాశివరాత్రి తర్వాత ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని, అప్పటివరకు భక్తులకు రాజన్న దర్శనం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.