పేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం

నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి

పేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం

దుబ్బాక:

దుబ్బాక నియోజకవర్గంలో పేదల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పేదల గృహ కలను సాకారం చేసే ఇందిరమ్మ ఇళ్ల పథకం వేగంగా అమలవుతోందని తెలిపారు.శుక్రవారం రాయపోల్ మండలం కొత్తపల్లి గ్రామంలో మంగలి సరస్వతి రాము దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పేదలకు సొంత ఇల్లు కలగడం జీవితంలో ఒక గొప్ప మైలురాయిగా అభివర్ణించారు. గృహహీనుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని పేర్కొన్నారు.ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి గృహసౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఎవరూ ఇల్లు లేకుండా ఉండకూడదన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, లబ్ధిదారులు సకాలంలో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకునేలా అధికారులు పూర్తి సహకారం అందించాలని సూచించారు.
గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం కావాలని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య, స్థానిక సర్పంచ్ ఎక్కాల శ్యామల మల్లేష్, సర్పంచ్ సత్తు అశోక్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు పల్పనూరి ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తప్పటి సుధాకర్, మాజీ ఎంపీటీసీ స్వామి, పుర్ర నర్సింలు, దుర్గాప్రసాద్, మహేష్, పాల రామాగౌడ్, చందు, పట్నం యాదగిరి, ఎల్లం, తూర్పు రవి, ఇక్బాల్, ఉప సర్పంచ్ రాజు, రామకృష్ణ, యాదిరెడ్డి, స్వామి, నర్సింగరావు, యూసుఫ్, బాకీ మల్లేశం, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

About The Author