భారీ వర్షాలతో సోమవారం ప్రజావాణి రద్దు

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

WhatsApp Image 2025-08-17 at 7.06.58 PM

అదిలాబాద్ జిల్లా బ్యూరో : జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రేపు నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వర్షాల కారణంగా జిల్లాలోని పలు మండలాల్లో నీటి ముట్టడి, రహదారుల దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తడంతో సంబంధిత శాఖల అధికారులు అవసరమైన సహాయక చర్యలు చేపడుతున్నారని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం వచ్చే సోమవారం యథావిధిగా నిర్వహించబడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.

Read More జోనల్ లెవెల్ క్రీడల ప్రారంభోత్సవానికి మంత్రులు : డిసిఓ వెంకటేశ్వర్లు

ఘనంగా శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు (భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, ఆగస్టు 18: స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు.

Read More చిన్న నీటి పారుదల వివరాల గణాంక ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ, సర్వాయి పాపన్న 1650లో వరంగల్ జిల్లా రఘునాథపాలెం మండలం, కిలాష్పూర్ గ్రామంలో జన్మించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి 1675లో సర్వాయిపేటలో రాజ్యం స్థాపించారు. గోల్కొండ కోటపై 12,000 మంది గెరిల్లా సైనికులతో దాడి చేసి, వరంగల్–భువనగిరి ప్రాంతాలను జయించారు. భువనగిరిని రాజధానిగా చేసుకొని 30 సంవత్సరాల పాటు పరిపాలించారని వివరించారు.

Read More పోలీసు ప్రతిష్టను కించపరిచేలా తప్పుడు సమాచారం ప్రసారం చేయవద్దు

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చందర్ నాయక్, డిబిసిడిఓ సయ్యద్ రఫీక్, అసిస్టెంట్ బిసిడిఓ చక్రధర్, గౌడ సంఘం నాయకులు రాజా గౌడ్, పల్లె రమేశ్ గౌడ్, తిరుమల గౌడ్, బహుజన నాయకులు కొత్తపల్లి మల్లయ్య, శివరాములు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 

Read More ప్రభుత్వ పాఠశాలలో బాల్యవివాహాలపై అవగాహన కార్యక్రమం ఎంపీఓ చంద్రశేఖర్.

About The Author