కోర్టు కేసులు ఉన్న భూములకు సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే ప్రభుత్వానికి పంపాలి.

- కలెక్టర్లను ఆదేశించిన ముఖ్య మంత్రి

కామారెడ్డి జిల్లా : 

WhatsApp Image 2025-09-22 at 6.36.28 PM

జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ, అటవీ భూముల కేటాయింపు, కోర్టు కేసులు పరిష్కార  ప్రక్రియను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లును ఆదేశించారు. 

Read More ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని

          
సోమవారం డా. బి.ఆర్. అంబేడ్కర్ సచివాలయం నుండి రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సిఎస్ రామకృష్ణా రావు, ఆర్ అండ్ బి కార్యదర్శి వికాస్ రాజ్ లతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పనులు వేగవంతం చేయుటపై ముఖ్యమంత్రి పలు సూచనలు జారీ చేశారు.

Read More అభివృద్ధి పనులకు 2కోట్ల హెచ్ఎండిఏ నిధులు మంజూరు

     
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దసరా పండుగకు ముందే అన్ని పనులు పూర్తికావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కోర్టు కేసులు ఉన్న భూములకు సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్లను ఆదేశించారు.
టైటిల్ సమస్యలు ఉన్న భూముల విషయంలో పరిహారం మొత్తాన్ని డిపాజిట్ చేసి, భూములను సేకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రహదారి నిర్మాణ పనులు ఆలస్యమవకుండా ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యంగా పరిగణించాలని అధికారులకు ఆదేశించారు. భూములు కోల్పోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని స్పష్టం చేశారు. భూసేకరణలో ఎలాంటి ఆలస్యం జరుగకూడదని, జిల్లాల వారీగా సమీక్ష చేపట్టి పురోగతిని పరిశీలిస్తానని జాప్యం జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జాతీయ రహదారుల నిర్మాణం రాష్ట్ర అభివృద్ధి, రవాణా సౌకర్యాల మెరుగుదలకు కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Read More విదేశాల్లో బందీ అవుతున్న భారతీయ మేధస్సు..

ఈ వీడియో కాన్ఫరెన్స్ ఐడిఓసి కార్యాలయం నుండి  జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ , అటవీ శాఖ అధికారి నికిత, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ విక్టర్,ఎల్లారెడ్డి ఆర్టీవో పార్థసింహారెడ్డి ఆర్ అండ్ బి, నేషనల్ హైవే అధికారులు తదితరులు  పాల్గొన్నారు.

Read More ప్రజావాణిలో వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించండి

About The Author