డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.

ఆరో రోజూ కొనసాగిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక - హెల్త్ వీక్’

  • మందుల దుర్వినియోగంపై అవగాహన ర్యాలీని ప్రారంభించిన డీఎంహెచ్‌ఓ లలితా దేవి..

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.

కొండాపూర్:

మత్తు పదార్థాల వాడకాన్ని అరికట్టడంతో పాటు, మందుల సురక్షిత వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ కె. లలితా దేవి తెలిపారు. ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహిస్తున్న హెల్త్ వీక్ వేడుకలు ఆరో రోజుకు చేరుకున్నాయి. శనివారం కొండాపూర్ జిల్లా ఆసుపత్రిలో ‘డ్రగ్ కంట్రోల్ అండ్ రెగ్యులేటరీ స్ట్రెంగ్తెనింగ్ డే’ నిర్వహించారు. డ్రగ్ కంట్రోల్ అథారిటీ, ఈగిల్ ఫోర్స్ తెలంగాణ సహకారంతో మెడికల్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

*ర్యాలీతో చైతన్యం*
కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని డీఎంహెచ్‌ఓ జెండా ఊపి ప్రారంభించారు. అలవాటుగా మారే ప్రమాదమున్న ఔషధాల దుర్వినియోగాన్ని అరికట్టాలని, నాణ్యమైన మందులనే వాడాలని ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈగిల్ టీమ్ ప్రతినిధులతో కలిసి డ్రగ్ దుర్వినియోగ నివారణ పోస్టర్లను ఆవిష్కరించారు.

**విద్యార్థులకు పోటీలు..
 బహుమతుల ప్రధానం**
యువతలో అవగాహన పెంపొందించేందుకు ఫార్మసీ, నర్సింగ్, స్కూల్ విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజేతలకు డీఎంహెచ్‌ఓ బహుమతులు అందజేశారు. డ్రగ్స్ నియంత్రణలో కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు రెగ్యులేటరీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. శాఖల మధ్య సమన్వయం ఉంటేనే మత్తు రక్కసిని తరిమికొట్టగలమని పేర్కొన్నారు.

*హాజరైన అధికారులు*
ఈ కార్యక్రమంలో ఈగిల్ టీమ్ డీఎస్పీ రమేష్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ జీవన్ కిరణ్, డీసీఏ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రసాద్, కొండాపూర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్ర కృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు పాల్గొన్నారు. అనంతరం ఆసుపత్రిలోని రిక్రియేషన్ సెంటర్‌ను సందర్శించిన డీఎంహెచ్‌ఓ, అక్కడ సిబ్బంది ఏర్పాటు చేసిన రంగోలి (ముగ్గుల) పోటీలను అభినందించారు. హెల్త్ వీక్ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్న సిబ్బందిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మందికి పైగా సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.WhatsApp Image 2026-04-11 at 18.11.32

About The Author