ఘనంగా శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ మహోత్సవాలు

  • కన్నుల పండుగగా అమ్మవారి కల్యాణం
  • -గ్రామ దేవతకు వైభవంగా బోనాల సమర్పణ
  • -వార్షికోత్సవానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు
  • -ముదిరాజ్ సంఘ నాయకులు

ఘనంగా శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ మహోత్సవాలు

గజ్వేల్

పెద్దమ్మ తల్లి దయతో గ్రామంలో వర్షాలు సంవృద్ధిగా కురిసి పాడి పంటలు పుష్కలంగా పండాలని ఆ జగన్మాతను కోరుకున్నామని వెంకటాపూర్ అగ్రహారం గ్రామ సర్పంచ్ అమ్మ పురం వెంకటేష్ అన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం వెంకటాపూర్(అగ్రహారం) గ్రామంలో ముదిరాజుల కుల దైవం పెద్దమ్మ తల్లి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం వేడుకలు ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో, కులపెద్ద, గ్రామ సర్పంచ్ అమ్మపురం వెంకటేష్ నేతృత్వంలో ఘనంగా నిర్వహింస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వెంకటేష్, మాజీ సర్పంచ్ ఆంజనేయులు, ఆలయ అర్చకులు, మాట్లాడుతూ ఆదివారం రోజున పెద్దమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాన్ని కన్నులపండువగా జరిపామని, ఈ రోజు గ్రామ దేవత పోచమ్మ తల్లికి, పెద్దమ్మ తల్లికి బోనాల సమర్పిస్తామని, మంగళవారం రోజున అమ్మవారికి గావురంగాల కార్యక్రమంలో ఉంటుందని తెలిపారు. పెద్దమ్మ తల్లి దయతో గ్రామంలో వర్షాలు సంవృద్ధి గా కురిసి పాడి పంటలు పుష్కలంగా పండాలని ఆ జగన్మాతను కోరుకున్నామని తెలిపారు, ఈ వార్షికోత్సవా వేడుకలకు ఆర్దిక రూపేణా, వస్తూ రూపేణా సహకరించిన వెంకటాపూర్ అగ్రహారం ముదిరాజ్ కుల బాంధవులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కులస్తులు, గ్రామ యువకులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

About The Author