బాధితురాలికి నష్ట పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశం
బాధిత కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించిన ఇన్సూరెన్స్ కంపెనీ
రంగారెడ్డి:
రంగారెడ్డి జిల్లా న్యాయస్థానంలోని XIII అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి కోర్టులో విచారణలో ఉన్న మోటారు వాహన ప్రమాద క్లెయిమ్ పిటిషన్ (ఓపీ నెం.489/2025) కేసులో బాధితురాలు కోట తులసి మరియు ఆమె కుటుంబ సభ్యులకు రూ.1 కోటి 6 లక్షల నష్టపరిహారం మంజూరైంది.ఈ కేసును న్యాయమూర్తి శ్రీమతి ఎం.వాణి విచారించి, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తూ పరిహారం చెల్లించాలని ఆదేశించారు. చోళమండలం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ఈ పరిహారం అందించబడింది.ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి శ్రీమతి జి. అనూష పాల్గొని బాధిత కుటుంబానికి అందిన న్యాయ సహాయంపై సంతృప్తి వ్యక్తం చేశారు.
కేసు పరిష్కారంలో చోళమండలం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ స్టాండింగ్ కౌన్సిల్ ఎ. పద్మారెడ్డి, పిటిషనర్ తరఫు న్యాయవాది టి. వెంకన్న కీలక పాత్ర పోషించారు. అలాగే లోక్ అదాలత్ సభ్యులు రాజ్ కిరణ్ మరియు శ్రీమతి డి. జ్యోతి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
మోటారు వాహన ప్రమాద బాధితులకు చట్టపరమైన హక్కులు కల్పించడం, తగిన నష్టపరిహారం అందించడం న్యాయ వ్యవస్థ యొక్క ముఖ్య లక్ష్యమని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు. భాధితురాలు కోట తులసి న్యాయమూర్తికి, న్యాయవాదులకు, కృతజ్ఞతలు తెలిపారు.
