అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే ఆశ వర్కర్లకు కనీస వేతనం రూ:18000/- నిర్ణయించాలీ
- ఆశా వర్కర్లపై టార్గెట్ వేధింపుల అరికట్టాలి
- తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి ఎం రేవతి కళ్యాణి
కాప్రా
ఉప్పల్ నియోజవర్గం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని కలసి వినతి పత్రం అందజేస్తూ తమ సమస్యలు పరిష్కరించాలని అసెంబ్లీలో చర్చ పెట్టాలని ఆశ వర్కర్లు కోరారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కనీస వేతనం 18 వేల రూపాయలను వెంటనే అమలు చేయాలని ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రకటించాలని కోరుతూ సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కే ఉన్నికృష్ణ తెలంగాణ ఆశ వర్కర్స్ అండ్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎం.రేవతి కళ్యాణి అసెంబ్లీలో చర్చ చేసుకొని పరిష్కారం చేయాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ని కోరారు. పేదలకు వైద్య సేవలు అందిస్తున్న ఎన్ హెచ్ ఎం కు సరిపడా నిధులు కేటాయించాలని. పెండింగ్ లో ఉన్న జనవరి ,ఫిబ్రవరి రెండు నెలల పారితోష్కాలను వెంటనే చెల్లించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 28 వేల మంది ఆశా వర్కర్లు గత 20 సంవత్సరాలు నుండి పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారని వీరంతా మహిళలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే అత్యధికలు ఉన్నారని ఎమ్మెల్యే దృష్టికి దృష్టికి తీసుకెళ్లారు.
కరోనా సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు వైద్య సేవలు అందించారని తెలిపారు.
ఆశా కార్యకర్తల యొక్క సేవలను గుర్తించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ )ఆరోగ్య కార్యకర్తలను గ్లోబల్ లీడర్స్ గా అవార్డునందించిందని తెలిపారు.
అనేక సేవలందిస్తున్న ఆశా కార్యకర్తలకు చట్టబద్ధ సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కనీసం పక్క రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో మాదిరిగా ఫిక్స్డ్ వేతనం ఇప్పటివరకు చేయలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఆశలకు కనీస వేతనం 18 వేల రూపాయలు అమలు చేస్తామన్న హామీ నేటికీ నెరవేరలేదన్నారు .50 లక్షల ఇన్సూరెన్స్ మట్టి ఖర్చులు ,రిటర్మెంట్ బెనిఫిట్స్ తదితర హామీలు ఇచ్చినప్పటికీ అవి హామీలుగానే మిగిలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఫోటో రైటప్:
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి ఆశా వర్కర్లు వినతిపత్రం అందజేస్తున్న దృశ్యం
