
ఖమ్మం ప్రతినిది :
స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో 42% రిజర్వేషన్ సాధించేత వరకు ఉద్యమిస్తామని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు స్పష్టం చేశారు. గురువారం నాడు ఆయన ఖమ్మం జిల్లా మధిర సిపిఐ కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బెజవాడ రవితో కలసి పాత్రికేయులతో మాట్లాడుతూ...
తెలంగాణ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న బీసీ ఉద్యమాన్ని అనగదొక్కేందుకు ప్రయత్నం చేస్తున్న బిజెపి నిజస్వరూపాన్ని బీసీల తో పాటు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు గమనించాలని, ఇటీవల కొంతమంది కొన్ని పత్రికలు కొంతమంది ఉద్యమకారులు బిసిలకు ఎస్సీలు వ్యతిరేకంగా ఉన్నారని వ్యాఖ్యలు చేస్తున్నారని అది నిజం కాదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో పాటు అనేకమంది ఎస్సీ నాయకులు ప్రొఫెసర్ ఖాసీం డాక్టర్ విశారదన్ మహరాజ్ లాంటి అనేక మంది బీసీ ఉద్యమానికి ఇప్పటికే మద్దతు ప్రకటించి ఉన్నారని తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్న అస్తిత్వ ఉద్యమాలను ప్రస్తుత తరుణంలో బీసీ ఉద్యమానికి బలహీనపరిచేందుకు బిజెపిలోని కొంతమంది కావాలనే ఇలాంటి కట్టుకథలు ప్రచారం చేస్తున్నారని, ప్రజా ఉద్యమాలు ఏనాటికి అపజయం పాలు కావని అనేది చరిత్ర చెబుతున్న సత్యం అని ఆయన ఉద్ఘాటించారు
ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లతో పాటు చట్టసభలో 50% రిజర్వేషన్ సాధించేవరకు మడమ తిప్పని పోరాటం చేస్తామని, 56% గా ఉన్న బీసీలు ఐక్యమైతే గ్రామపంచాయతీ వార్డు మొదలుకొని ప్రధాని వరకు అందరూ బీసీలు అవుతారని బీసీలకు రాజ్యాధికారం చేతికి వస్తే బీసీలకు కావలసిన అన్ని రకాల చట్టాలు అమలు చేసుకుంటారనే విషయాన్ని ప్రతి బీసీ వ్యక్తి గమనించాలని, 2028 లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి బీసీ కూడా బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేసి బీసీల సత్తా చాటాలని అందుకు క్షేత్రస్థాయిలో ఉద్యమాల నిర్మాణo చేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు
ఆయన వెంట బీసీ హక్కుల సాధన సమితి నాయకులు చిలకరాజు శ్రీనుకొమర్రాజు వెంకట్ బత్తిని శ్రీనివాస గౌడ్ ఉన్నారు