'ది నానో' అక్రమ విద్యా మాఫియా!

  • జిహెచ్ఎంసి సర్కిల్ 16 బడంగ్‌పేట్‌లో 'దనానో' పేరుతో అనుమతులు లేని అక్రమ సామ్రాజ్యం!
  •  *మున్సిపల్ పర్మిషన్ లేదు.. ఫైర్ సేఫ్టీ నిల్.. ఇంటర్ బోర్డు గుర్తింపే లేదు!
  •  *400 గజాల ఇరుకు గదుల్లో 300 మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం! డీఐఓ వెంకటయ్య నాయక్ ఎక్కడ..!
  •  *ప్రముఖ బ్రాండ్ పేరుతో బోర్డు తిప్పేసి.. లక్షల ఫీజులు దండుకుంటున్న వైనం!
  •  *ఇంత అవినీతి జరుగుతున్నా కన్నెత్తి చూడని ఇంటర్ బోర్డు అధికారులు..
  •  *అక్రమార్కులకు అండగా మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, టౌన్ ప్లానింగ్ అధికారి దినేష్?
  •  *కమిషన్ల కక్కుర్తిలో కళ్లు మూసుకున్న అధికార యంత్రాంగంపై స్థానికుల ఆగ్రహం!
  • మాజీ విద్యా శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఈ అవినీతిని అంతం అందిస్తారా..?

'ది నానో' అక్రమ విద్యా మాఫియా!

అక్షరాల వెనుక అక్రమ దందా.. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన సంస్థే నిబంధనలను నడిరోడ్డుపై ఖూనీ చేస్తూ అక్రమ విద్యా మాఫియాగా మారింది! బడంగ్‌పేట్ సర్కిల్ 16 పరిధిలో, ఎలాంటి మున్సిపల్ పర్మిషన్, ఫైర్ సేఫ్టీ, ఇంటర్ బోర్డు గుర్తింపు లేని 'ది నానో' జూనియర్ కాలేజ్ 300 మంది విద్యార్థుల జీవితాలను మృత్యుకూపంలోకి నెడుతోంది. ప్రముఖ బ్రాండ్ పేరును కాపీ కొడుతూ, కేవలం 400 గజాల ఇరుకు గదుల్లో లక్షల ఫీజులు దండుకుంటోన్న ఈ ఘోర అక్రమాలపై మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, టౌన్ ప్లానింగ్ అధికారి దినేష్ మామూళ్ల మత్తులో కళ్లు మూసుకోవడం సిగ్గుచేటు. విద్యార్థుల భవిష్యత్తు అంధకారం కాకముందే ఉన్నతాధికారులు, ఇంటర్ బోర్డు తక్షణమే స్పందించి ఈ అక్రమ క్యాంపస్‌ను సీజ్ చేయాలి!

*బడంగ్‌పేట్:

జీహెచ్‌ఎంసీ మహానగరం నడిబొడ్డున, బడంగ్‌పేట్ సర్కిల్ 16 పరిధిలోని నాదర్గుల్ ఎం.వి.ఎస్.ఆర్. ఇంజనీరింగ్ కాలేజీ ఎదురుగా "ది నానో" కాలేజీ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. అక్షరాల వెనుక అక్రమ వ్యాపారం.. విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టి సాగుతున్న ఒక నగ్న సత్యం.. బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వెలుగుచూసింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన సంస్థే నిబంధనలను నడిరోడ్డుపై ఖూనీ చేస్తూ అక్రమ దందాకు తెరలేపింది.
నాదర్గుల్ విలేజ్, ఎం.వి.ఎస్.ఆర్. ఇంజనీరింగ్ కాలేజీకి సరిగ్గా ఆపోజిట్‌గా, విజయలక్ష్మి నగర్ కాలనీలోని పూజా జువెలర్స్ పక్కన వెలిసిన 'ది నానో జూనియర్ కాలేజ్' (బాయ్స్ & గర్ల్స్ క్యాంపస్) ఇప్పుడు విద్యార్థుల పాలిట మృత్యుకూపంగా, తల్లిదండ్రుల పాలిట మోసపూరిత కేంద్రంగా మారింది. కనీసం మున్సిపల్ పర్మిషన్ లేదు.. ప్రమాదం వస్తే ప్రాణాలు కాపాడే ఫైర్ సేఫ్టీ లేదు.. అసలు ఇంటర్మీడియట్ బోర్డు గుర్తింపే లేదు! అయినప్పటికీ దర్జాగా బోర్డు తగిలించి, రంగుల ప్రకటనలతో ఏకంగా 300 మంది విద్యార్థులను చేర్చుకుని లక్షల రూపాయలు గుంజేసింది ఈ అక్రమ విద్యా మాఫియా!WhatsApp Image 2026-06-07 at 17.13.50

*నాడు 'కోచింగ్'.. నేడు 'కాలేజీ'.. అంతా దొంగ దందా!
కేవలం 400 గజాల ఇరుకైన ప్లాట్ నెంబర్ 30 (ఆర్‌సీఐ రోడ్, బడంగ్‌పేట్ - అల్మాస్‌గూడ రోడ్) లో గర్ల్స్ క్యాంపస్, అదేవిధంగా ఎం.వి.ఎస్.ఆర్. ఇంజనీరింగ్ కాలేజీ ఎదురు సందులో, విజయలక్ష్మి నగర్ కాలనీ (నాదర్గుల్ విలేజ్, బాలాపూర్ మండలం) పూజా జువెలర్స్ పక్కన బాయ్స్ క్యాంపస్ వెలిశాయి. ఈ భవనాల్లో క్లాస్ రూములను అగ్గిపెట్టెల్లా ఇరికించారు. ప్రముఖ విద్యాసంస్థ 'నానో' పేరును కాపీ కొడుతూ, ఇక్కడ "ది నానో" పేరుతో లోపాయకారీగా నడుపుతున్న ఈ దొంగ కాలేజీకి అసలు అస్తిత్వమే లేదు. చట్టబద్ధంగా ఒక్కటంటే ఒక్క అనుమతి పత్రం కూడా యాజమాన్యం వద్ద లేకపోవడం గమనార్హం.

 *ఖూనీ అయిన మున్సిపల్ చట్టాలు: కమర్షియల్ విద్యాసంస్థలు నడపాలంటే ఉండాల్సిన బిల్డింగ్ మాస్టర్ ప్లాన్ నిబంధనలను (Building Master Plan Compliances) పూర్తిగా తుంగలో తొక్కారు. మున్సిపాలిటీ నుండి ఎలాంటి కమర్షియల్ భవన అనుమతులు లేకుండానే ఈ నిర్మాణం సాగింది.

 *భయం గొల్పుతున్న ఇరుకు గదులు – సున్నా ఫైర్ సేఫ్టీ:రేపు పొద్దున ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే వందలాది మంది విద్యార్థులు బయటకు రావడానికి కనీస నడవా (కారిడార్) స్థలం కూడా లేదు. ఫైర్ ఎన్‌ఓసీ (Fire NOC) ఊసే లేదు. విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టి క్లాసులు నడుపుతున్నారు.

 *ఆటస్థలం లేదు.. అనుబంధ గుర్తింపు లేదు: ఇంటర్ బోర్డు (TS BIE) నిబంధనల ప్రకారం జూనియర్ కాలేజీకి ఉండాల్సిన కనీస ఆటస్థలం (Playground) ఇక్కడ లేదు. అసలు ఇంటర్ బోర్డు ఈ క్యాంపస్‌కు అఫిలియేషనే ఇవ్వలేదు. గుర్తింపు లేని కాలేజీలో చదివితే రేపు విద్యార్థుల సర్టిఫికెట్లకు విలువేముంటుందని తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు.WhatsApp Image 2026-06-07 at 17.12.20

*మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య.. టౌన్ ప్లానింగ్ దినేష్.. మీ సమాధానం ఏంటి?
ఈ ఘోర అక్రమాలపై స్థానిక ప్రజలు, బాధితులు బడంగ్‌పేట్ సర్కిల్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకు, టౌన్ ప్లానింగ్ అధికారి దినేష్‌కు సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. కానీ, సదరు అధికారులు అక్రమార్కులకు సింహాసనం వేసి కూర్చోబెడుతున్నారు తప్ప చర్యలు తీసుకోవడం లేదు. ముడుపుల మత్తులో జోగుతూ, అక్రమ కట్టడాల యాజమాన్యానికి పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న ఈ అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల అండ చూసుకునే కాలేజీ యాజమాన్యం ఇంతలా రెచ్చిపోతోందని బహిరంగంగా విమర్శలు వినిపిస్తున్నాయి.

*నిబంధనల ఉల్లంఘన - చట్టపరమైన చర్యలు
అనుమతులు లేని విద్యాసంస్థల అక్రమాలపై కఠిన చట్టాలను ప్రయోగించాల్సిన అవసరం ఉంది. అందించిన సమాచారం ప్రకారం బాధ్యులపై కింది సెక్షన్ల కింద చర్యలు తీసుకోవడానికి పూర్తి శాసనపరమైన ఆధారాలు ఉన్నాయి:
*తెలంగాణ విద్యా చట్టం (1982) లోని సెక్షన్ 20, 21: దీని ప్రకారం గుర్తింపు లేని విద్యాసంస్థలను సీజ్ చేసి, యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించవచ్చు.

మున్సిపల్ కార్పొరేషన్ చట్టం (2019): భవన నిర్మాణ ఉల్లంఘనలపై ఈ చట్టం కింద తక్షణమే కూల్చివేత చర్యలు చేపట్టవచ్చు.

"తెలంగాణ అగ్నిమాపక సేవల చట్టం (1999) సెక్షన్ 13, 31: ఫైర్ ఎన్‌ఓసీ (Fire NOC) లేని భవనాలపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేయవచ్చు.

"భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 318, 61: తప్పుడు ప్రకటనలతో తల్లిదండ్రులను మోసం చేసినందుకు క్రిమినల్ చీటింగ్, కుట్ర కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించవచ్చు.

 *'స్థానిక ప్రజల' డిమాండ్: ఇంటర్ బోర్డు, పోలీస్ శాఖ తక్షణమే రంగంలోకి దిగాలి!
అడ్మిషన్ల పేరుతో ఇప్పటికే అందినకాడికి దండుకున్న ఈ అక్రమ కాలేజీపై మున్సిపల్ ఉన్నతాధికారులు, ఇంటర్మీడియట్ బోర్డు మరియు పోలీస్ శాఖ తక్షణమే క్రిమినల్ యాక్షన్ ప్రారంభించాలి. 300 మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారం కాకముందే ఈ 'ది నానో' అక్రమ క్యాంపస్‌ను సీజ్ చేయాలి. విద్యార్థులను ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేయాలి.
అలాగే అక్రమార్కులకు సపోర్ట్ చేసిన బడంగ్‌పేట్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, టౌన్ ప్లానింగ్ అధికారి దినేష్‌లపై తక్షణమే శాఖాపరమైన విచారణ జరిపి సస్పెండ్ చేయాలని 'భారత శక్తి' డిమాండ్ చేస్తోంది. విద్యార్థుల ప్రాణాలతో ఆడుకునే ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు!
మరిన్ని ఆధారాలతో రేపటి కథనంలో..!WhatsApp Image 2026-06-07 at 17.12.20 (1)

About The Author